Chalmeda Lakshmi Narasimha Rao : ఎటువంటి కండీషన్ లేకుండా టీఆర్ఎస్‌లో చేరుతున్నా… కాంగ్రెస్ భవిష్యత్ ఆందోళనకరం

కరీంనగర్ జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహ రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఎటువంటి కండీషన్ లేకుండానే తాను..

Chalmeda Lakshmi Narasimha Rao : కరీంనగర్ జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహ రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఎటువంటి కండీషన్ లేకుండానే తాను అధికార పార్టీలో చేరుతున్నానని చెప్పారు. అంతేకాదు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 8న గులాబీ కండువా కప్పుకోనున్నారు. వేములవాడ టికెట్ ఆశించి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు చల్మెడ లక్ష్మీనర్సింహరావు.

Body Ageing: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

”రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశా. సోనియా గాంధీ మూడు పర్యాయాలు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మా పార్టీ వాళ్లే మమ్మల్ని ఓడగొట్టారు. 2009లో ప్రత్యర్థి పార్టీతో కలిసి ఓడగొట్టారు. అయినా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా అందరిని కలుపుకునిపోయాను. అంతర్గత కుట్రలతో ఓడిపోయాను. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆందోళనకరంగా ఉంది. రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ ముందుకు వెళ్తుందనుకున్నాం. నాయకులకు చిత్తశుద్ధి లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిస్తే ఉంటారా? మరో పార్టీలోకి వెళ్తారా? అని ప్రజలు భావిస్తున్నారు. బాధతోనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నా” అని చల్మెడ లక్ష్మీనర్సింహరావు అన్నారు.

చల్మెడ లక్ష్మీనర్సింహరావు చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల చైర్మన్ గా ఉన్నారు. పీసీసీ ప్రధాన కార్య దర్శితోపాటు వివిధ హోదాల్లో కొనసాగిన ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సీఎం కుమారుడు, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఈ నెల 8న తెలంగాణ భవన్ లో తన అనుచరులతో కలిసి ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. కాగా, వేములవాడ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వం అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది.

Liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసే ఆలోచనలో చల్మెడ ఉన్నారని, అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. లక్ష్మీనర్సింహరావు తండ్రి చల్మెడ ఆనంద రావు ఎన్టీఆర్ హయాంలో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుండి కాకుండా వేములవాడ నుంచి చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తన సీనియారిటీని గుర్తించకుండా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు