Kasani Gnaneshwar : బీఆర్ఎస్‌లో చేరనున్న టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. గోశామహల్ నుంచి పోటీ?
ఏ పార్టీలోకి వెళితే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనే దానిపై సమాలోచనలు జరిపారు. చివరికి అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లాలని డెసిషన్ తీసుకున్నారు Kasani Gnaneshwar

Kasani Gnaneshwar To Join BRS
Kasani Gnaneshwar To Join BRS : తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. రేపు(నవంబర్ 3) ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బీఆర్ఎస్ లో చేరనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
చంద్రబాబు నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి..
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కాసాని తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసేశారు. అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని కారు ఎక్కనున్నారు.
Also Read : నా ప్రాణం పోయినా ఆ పని చేయను, ఎన్నికల్లో గెలవాల్సింది మీరే- సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కారు ఎక్కితేనే భవిష్యత్తు..
119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాసాని భావించారు. ఆ మేరకు కసరత్తు కూడా చేశారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మరో దారి లేక టీడీపీకి గుడ్ బై చెప్పానని కాసాని తెలిపారు. టీడీపీకి రాజీనామా చేశాక ఏ పార్టీలోకి వెళ్లాలి అనేదానిపై కాసాని మంతనాలు జరిపారు. ఏ పార్టీలోకి వెళితే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనే దానిపై సమాలోచనలు జరిపారు. చివరికి అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లాలని డెసిషన్ తీసుకున్నారు. బీఆర్ఎస్ లో అయితేనే తన పొలిటికల్ ఫ్యూచర్ బాగుంటుందని ఆయన భావించారు. ఈ మేరకు బీఆర్ఎస్ తో ఆయన జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
గోశామహల్ నుంచి బరిలోకి కాసాని? అక్కడి నుంచే ఎందుకు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ కచ్చితంగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాసానిని గోశామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గోశామహల్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేత కాబట్టి అక్కడ కచ్చితంగా ఎంఐఎం కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. ఎంఐఎం ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కు పడే అవకాశం ఉంది కనుక కచ్చితంగా కాసానికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం. కాసాని బీఆర్ఎస్ లో చేరాక గోశామహల్ నుంచి పోటీ చేసే అవకాశాలపై పరిశీలించే అవకాశాలు ఉన్నాయి.
Also Read : టీడీపీ పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో చెప్పాలి.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాసాని కండీషన్..
బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడానికి ముందే కాసాని రెండు మూడు కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. తన ముఖ్య అనుచరులను అందరినీ బీఆర్ఎస్ లో చేర్చిన తర్వాత తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ ను కోరినట్లు తెలుస్తోంది. ఆయన కోరిక మేరకే పెండింగ్ లో ఉన్న గోశామహల్ నుంచి కాసానిని పోటీకి దింపితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
కాసాని బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడం, గోశామహల్ లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఎంఐఎం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం.. దాంతో కాసాని గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాసాని బీఆర్ఎస్ లో చేరాక ఒకటి రెండు రోజుల్లో.. గోశామహల్ నుంచి కాసాని పోటీపై అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.