KA Paul : కేసీఆర్ ఓడిపోవడం ఖాయం.. ప్రజా శాంతి పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది : కేఏ పాల్
కాంగ్రెస్ లో ఉన్నవారు అందరూ కేసీఆర్ కోవర్టులేనని పేర్కొన్నారు. షర్మిల ప్యాకేజీ కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిందని ఆరోపించారు. బీసీలకు కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు.

KA Paul
KA Paul – KCR : కేసీఆర్ పతనం ప్రారంభమైందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడం ఖాయం అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రజా శాంతి పార్టీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ధరణి పోర్టల్ లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ వల్ల లక్షల ఎకరాలు రైతులు నష్ట పోతున్నారని తెలిపారు. ధరణి పోర్టల్ గురించి పోరాటం చేస్తున్న తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హైకోర్టు లోపలికి వెళ్లకుండా తనను రిజిస్టర్ జనరల్ అడ్డుకుంటున్నారని ఇదంతా కేసీఆర్ కుట్రలో భాగమే అని అన్నారు. వేలాది మంది నిరుద్యోగులతో కేసీఆర్ ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Minister Roja : రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా
కాంగ్రెస్ లో ఉన్నవారు అందరూ కేసీఆర్ కోవర్టులేనని పేర్కొన్నారు. షర్మిల ప్యాకేజీ కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిందని ఆరోపించారు. బీసీలకు కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశానని.. తనను అక్రమంగా ఆరెస్ట్ చేశారని తెలిపారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడమే గద్దరన్న చివరి ఆశయమని తెలిపారు.
గద్దరన్న ఆశయం నెరవేర్చాలంటే ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రజా శాంతి పార్టీలో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 4 గంటలకు హరిహర కళాభవన్ లో ప్రజా శాంతి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తానని చెప్పారు.