Ponguleti Srinivas Reddy : కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం : పొంగులేటి

వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Ponguleti Srinivas Reddy : కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం : పొంగులేటి

Ponguleti Srinivas Reddy (4)

Updated On : October 24, 2023 / 6:47 PM IST

Ponguleti Srinivas Reddy – KCR : సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని విమర్శించారు. మంగళవారం ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి వర్గీయుల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

కాంగ్రెస్ పార్టీలో చేరికకు బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి వర్గీయులు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.

Revanth Reddy : కొడంగల్ లో నాపై కేసీఆర్ పోటీ చేయాలని.. రేవంత్ రెడ్డి సవాల్

పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.