KTR Son Himanshu: సీఎం కేసీఆర్ మనవడి చొరవ.. కొత్తరూపు సంతరించుకున్న కేశవనగర్ సర్కార్ స్కూల్

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు గొప్ప మనస్సు చాటుకున్నాడు. రూ. 90లక్షల వ్యయంతో కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో మర్మతులతో పాటు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను కల్పించారు.

KTR Son Himanshu: సీఎం కేసీఆర్ మనవడి చొరవ.. కొత్తరూపు సంతరించుకున్న కేశవనగర్ సర్కార్ స్కూల్

KTR Son Himanshu

Updated On : July 11, 2023 / 9:58 AM IST

KCR Grandson Himanshu: సీఎం కేసీఆర్ (CM KCR) మనవడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) గొప్ప మనస్సు చాటుకున్నాడు. తాను పాఠాలు బోధించేందుకు వెళ్లిన ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితిని గమనించి దత్తత తీసుకున్నాడు. రూ.90లక్షలు పోగుచేసి నెల రోజుల్లో పేద పిల్లలు చదువుకొనే సర్కార్ బడి రూపురేఖలు మార్చేశాడు. హిమాన్షు చొరవ, చేయూతతో పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో హిమాన్షు చొరవకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తరూపు సంతరించుకున్న ఈ పాఠశాలను హిమాన్షు పుట్టినరోజైన ఈనెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

KTR Son Himanshu Song : కొడుకు పాటకు కేటీఆర్ ఫిదా.. గర్వంగా ఉందని కితాబు

ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేపట్టే క్యాస్ (కమ్యూనిటీ యాక్సన్ సర్వీస్) విభాగం విద్యార్థులు గౌలిదొడ్డి కేశవనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు బోధించేందుకు ప్రతి శనివారం వెళ్లేవారు. ఆ పాఠశాలలో 150 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత ఏడాది తమ పాఠశాల క్యాస్ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన హిమాన్షుకూడా ప్రతీ శనివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవారు. అయితే, అక్కడ వసతులు సరిగా లేకపోవటంతో పాఠశాల రూపురేఖలు మార్చేయాలని భావించిన హిమాన్షు.. అనుకున్నదేతడవుగా ప్రధానోపాధ్యాయుడు వద్దకు వెళ్లాడు. పాఠశాలకు ఎలాంటి సౌకర్యాలు అవసరం అవుతాయనే విషయాలను తెలుసుకున్నాడు. తన పాఠశాలలో సీఏఎస్ కార్యక్రమానికి అధ్యక్షుడిగా సేకరించిన నిధులు రూ. 90లక్షలతో పాఠశాల ఆదునీకరణ పనులు ప్రారంభించారు.

 

Keshavnagar Govt School

Keshavnagar Govt School

బెంచీలు, మరుగుదొడ్లు, డైనింగ్ గది, ఆటస్థలాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపాడు. పాఠశాలలోఅన్ని వసతి సౌకర్యాలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రతి గదిలో బల్బులు, ఫ్యాన్లు, పాఠశాల ఆవరణంలో బోరుకూడా ఏర్పాటు చేశారు. దీనికితోడు డిజిటల్ తరగతి గదులనూ అందుబాటులోకి తెచ్చారు. చిన్నారులు కూర్చునేందుకు ఆధునిక బల్లలు సమకూర్చారు. గ్రంథాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. అదనంగా రెండు తరగతి గదులను నిర్మించారు. దీంతో పాఠశాల అభివృద్ధికి హిమన్షు చొరవకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.