Khairatabad Ganesh : నిమజ్జనానికి తయారైన ఖైరతాబాద్ గణేష్

భక్తుల నుంచి ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి తరలుతున్నాడు. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు.

Khairatabad Ganesh : నిమజ్జనానికి తయారైన ఖైరతాబాద్ గణేష్

Mnkljkl

Updated On : September 19, 2021 / 7:04 AM IST

Khairatabad Ganesh : భక్తుల నుంచి ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి తరలుతున్నాడు. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు. భారీ గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 40 అడుగుల్లో పంచముఖ రుద్ర మహా గణపతిగా కొలువుదీరిన విఘ్నేశ్వరున్ని 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేర్చనున్నారు.

Read More :Tank Bund : గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగేది ఇలా 

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర రెండున్నర కిలోమీటర్ల పొడవునా సాగనుంది. దీంతో పోలీసులు ఈ రూట్‌మ్యాప్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నారు.  ఎప్పటిలానే రూట్‌ మ్యాప్‌ ప్రకారం.. ద్వారకా హోటల్‌, టెలీఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, ఓల్డ్‌ సెక్రటేరియట్‌ గేట్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, లుంబినీ పార్క్‌ మీదుగా ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర జరగనుంది.

Read More : Ganesh Visarjan : బై బై గణేషా…గంగమ్మ ఒడికి గణనాథుడు

క్రేన్‌ నెంబర్‌ 6 దగ్గర హుస్సేన్‌సాగర్‌లో గణనాథుడి నిమజ్జనం జరగనుంది.ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతికి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం లంబోదరుడు నిమజ్జనానికి తరలిపోనున్నాడు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణేశుడిని తరలించేందుకు విజయవాడ నుంచి ఇప్పటికే భారీ క్రేన్‌ను తీసుకొచ్చారు.