Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వారికి ఎలా ఇస్తారు?: తమిళిసై నిర్ణయంపై కిషన్ రెడ్డి

గవర్నర్ తమిళిసై ఈ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాగా, తమిళిసై నిర్ణయంపై..

Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వారికి ఎలా ఇస్తారు?: తమిళిసై నిర్ణయంపై కిషన్ రెడ్డి

Kishan-Reddy

Updated On : September 25, 2023 / 5:41 PM IST

Kishan Reddy – Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడం సరైనదేనని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం దాసోజు శ్రవణ్(Dasoju Sravan), కుర్రా సత్యనారాయణ(Kurra Satyanarayana)ను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సును గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.

దీనిపై కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గవర్నర్ కోటాలో చేసిన ఎమ్మెల్సీల సిఫార్సులను తిర్కరించడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. గవర్నర్ తమిళ్ సై తీసుకున్న నిర్ణయం సరైందేనని చెప్పారు. గవర్నర్ కోట అంటే రాజకీయ నేతలకు ఎమ్మెల్సీలు ఇవ్వడం కాదని, రాజకీయేతర వ్యక్తులకు ఇస్తారని తెలిపారు.

ఈ కోటాలో మేధావులు, రచయితలు, కవులు, కళాకారులకు, ప్రజా సేవ చేసే వారికు ఇస్తారని వివరించారు. అంతేగానీ, సీఎం కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని ఎలా నామినేట్ చేస్తారని నిలదీశారు. గవర్నర్ తమిళిసై ఈ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాగా, తమిళిసై నిర్ణయంపై దాసోజు శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి పొందే అర్హత ఉందని చెప్పారు.

లీగల్ టీమ్‌ మరింత పటిష్ఠం
ఎన్నికల వేళ బీజేపీ లీగల్ టీమ్‌ని కిషన్ రెడ్డి మరింత పటిష్ఠం చేశారు. జి.రామారావు కన్వీనర్‌గా, ఆరుగురు కో కన్వీనర్లుగా మరో ఏడుగురు సభ్యులతో లీగల్ టీమ్‌ని ప్రకటించారు. ఈ టీమ్‌కి సలహాదారులుగా బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, రామచందర్ రావు, ఆంటోనీ వ్యహరిస్తారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న కాసం వెంకటేశ్వర్లును రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన తమిళిసై