కేటీఆర్ ఫాంహౌస్ వద్దకు వెళ్లి వచ్చాను: మంత్రి కోమటిరెడ్డి
ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు తెలుసని..

Telangana Minister Komati Reddy Venkat Reddy
Komatireddy Venkat Reddy: రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫాంహౌస్ ఉందని, నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటూ కాంగ్రెస్ నేతలు అంటున్న వేళ దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా స్పందించారు. కారును తీసుకొని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని మరీ వెళ్లి కేటీఆర్ ఫాంహౌస్‌ను చూసి వచ్చానని తెలిపారు.
నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే హైడ్రా అధికారులు కేటీఆర్ ఫాంహౌస్‌ను కూల్చేస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు తెలుసని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని అన్నారు. కేటీఆర్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యుల శ్రద్ధ పెట్టాలని, ఆయనను చూస్తే జాలి వేస్తోందని అన్నారు. పదేళ్లో ఒక్కసారి కూడా అంబేద్కర్ చిత్రపటానికి కేసీఆర్ దండ వేయలేదని చెప్పారు.
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ అంటుంటే నవ్వొస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ జన్వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మించుకున్నారని, సినిమా యాక్టర్ల బిల్డింగులు అక్రమంగా ఉన్నా కూల్చేస్తామని చెప్పారు. అందరం కలిస్తేనే తెలంగాణ వచ్చిందని, తాము కేసీఆర్ లాగా దొంగ దీక్షలు చేయలేదని అన్నారు.
Also Read: ఆ ఫామ్ హౌస్‌ను నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు