Munugode BYy poll : ‘పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటా’నంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటా’నంటూకాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Komatireddy Venkat Reddy's sensational comments that he will take political retirement
Munugode BYy poll : మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..స్టార్ క్యాంపెయినర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఆస్ట్రేలియా చెక్కేశారు. పైగా కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన తమ్ముడ రాజగోపాల్ రెడ్డే గెలవాలనే కోరుకుంటున్నారు వెంకట్ రెడ్డి. తన సొంత పార్టీ గురించి ఏమాత్రం ఆలోచించనట్లుగా తెలుస్తోంది వెంకట్ రెడ్డి వ్యవహారం. మునుగోడులో ప్రచారం మానేసి ఆస్ట్రేలియా వెళ్లటం ఒకటైతే అక్కడినుంచి ఆయన వీడియోల ద్వారా చేస్తున్న వ్యాఖ్యలు సంచలన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
ఓ వీడియో రిలీజ్ చేస్తూ నా తమ్ముడు రాజగోపాల్ కే ఓట్లు వేయాలని చెప్పటం కాంగ్రెస్ లో కల్లోలం కలిగిస్తున్న క్రమంలో ‘అవసరమైతే రాజకీయల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా’అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నా..అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.మునుగోడులో ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోవటం గురించి కాంగ్రెస్ పార్టీనుంచి పలు అసంతృప్తులు వస్తున్న క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన కూడా ఇక వేరే పార్టీకి వెళ్లిపోతారంటూ అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మునుగోడులో నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు ఇబ్బందుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రచారం చేసినా గెలవదు..చేయకపోయినా గెలవదు. అటువంటిది ప్రచారం ఎందుకు? అంటూ ప్రశ్నించారు.25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎంపీగా ఉన్నా అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
అటు అధికార పార్టీ, ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి హీట్ పుట్టిస్తోంది. గెలుపు కోసం మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లోంచి బీజేపీలోకి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చింది. దీంతో కాంగ్రెస్..బీజేపీ ఈ ఎన్నికల గెలుపు చాలా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. అలాగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతోందనే మాటను మునుగోడు గెలుపుతో తుడిచిపెట్టేయాలనుకుంటోంది గులాబీ పార్టీ. దీంతో మునుగోడు గెలుపు అన్నింటికి ముఖ్యంగా మారింది.ఈక్రమంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయటంతో అటు తమ్ముడికి ఓట్లు వేయమని పరోక్షంగానే మునుగోడు కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేసి చెప్పిన వెంకట్ రెడ్డి ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లో కూడా తన తమ్ముడికి ఓటు వేయాలంటూ కోరటం చూసినా..రిటైర్మెంట్ తీసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు విన్నా.. ఇక వెంకట్ రెడ్డి ఇక రాజకీయాలు చాలు అనుకుంటున్నారా? అనిపిస్తోంది.