Konda Surekha : చెస్‌లో మనవడు ప్రతిభ.. పరుగెత్తుకుంటూ వెళ్లి ముద్దులతో ముంచెత్తిన మంత్రి కొండా సురేఖ.. వీడియో వైరల్
Konda Surekha : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ - మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ కుమారుడు శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ చెస్ గేమ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
Konda Shreyansh Murali Krishna Patel
- చెస్ క్రీడలో సత్తాచాటిన మంత్రి కొండా సురేఖ మనవడు
- శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ అద్భుత ప్రదర్శన
- చెస్‌లో ఒకేసారి డబుల్ వరల్డ్ రికార్డులు సొంతం
- శ్రేయాన్స్‌ను అభినందించిన భట్టి విక్రమార్క, వాకిటి శ్రీహరి
Konda Surekha : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ – మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ కుమారుడు శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ చెస్ గేమ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కేవలం రెండేళ్ల 11 నెలల వయస్సులోనే ఈ బుడ్డోడు తన ఎత్తులు పైఎత్తులతో చెస్ బోర్డుపై ఆధిపత్యం కనబర్చి సత్తాచాటాడు. ఈ క్రమంలో అతిచిన్న వయస్సులో ఒకేసారి రెండు వరల్డ్ రికార్డులు సాధించి చరిత్ర నెలకొల్పాడు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం చదరంగం పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సురేఖ మనవడు శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్ పాల్గొని అద్భుత ఆటతీరుతో రికార్డుల మోత మోగించాడు. కేవలం రెండేళ్ల 11నెలల వయస్సులోనే శ్రేయాన్ష్ చెస్‌లో ఒకేసారి డబుల్ వరల్డ్ రికార్డును తనపేరు మీద లిఖించుకున్నాడు.
15నిమిషాల 52 సెక్షన్లలోనే శ్రేయాన్ష్ 93బ్యాక్ ర్యాంక్ చెక్మెంట్స్ను పరిష్కరించాడు. మరో విభాగంలో గంట 9నిమిషాల 9సెకన్లలో 21 చెస్ బోర్డులను అమర్చి ఇంకో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు విభాగాల్లోనూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో రెండు వరల్డ్ రికార్డులను దక్కించుకున్న అతిచిన్న వయస్సు కలిగిన బాలుడిగా శ్రేయాన్ష్ నిలిచాడు. ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్ పార్లమెంట్లో శ్రేయాన్ష్ అవార్డు అందుకోనున్నారు.
మనవడు శ్రేయాన్ష్ చెస్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన అనంతరం మంత్రి కొండా సురేఖ పరుగెత్తకుంటూ వెళ్లి మనవడిని ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తారు. సంతోషంతో బావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. రాయ్చెస్ అకాడమీ ఫౌండర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉజ్వల్ చౌహాన్ జడ్జిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. భట్టి, వాకిటి శ్రీహరిలు శ్రేయాన్ష్‌ను అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెండు సంవత్సరాల 11 నెలల అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డును సాధించిన ఏకైక బాలుడిగా నిలిచిన కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్..
రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం… pic.twitter.com/lKeJoYUExU
— Konda Surekha (@iamkondasurekha) April 7, 2026
