Konda Surekha: మీడియా ముందు కొండా సురేఖ కన్నీరు.. భావోద్వేగభరిత వ్యాఖ్యలు

'కేటీఆర్ ఖబడ్దార్.. కేసీఆర్ ఖబడ్దార్' అని ఆమె నినదించారు.

Konda Surekha: మీడియా ముందు కొండా సురేఖ కన్నీరు.. భావోద్వేగభరిత వ్యాఖ్యలు

Updated On : September 30, 2024 / 7:17 PM IST

తనను అవమానిస్తూ తనపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్‌ సోషల్‌ మీడియా నిర్వాహకులు దారుణమైన పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ఇలా డబ్బులిచ్చి మహిళలను ట్రోల్‌ చేయడం ఏంటని నిలదీశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు.

తాను ఇన్‌చార్జి మంత్రిగా మెదక్ జిల్లాకు వెళ్లానని, ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలపై చెప్పి గౌరవంగా చేనేత మాలను తన మెడలో వేశారని అన్నారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశానని తెలిపారు. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది అని అన్నారు. ‘కేటీఆర్ ఖబడ్దార్.. కేసీఆర్ ఖబడ్దార్’ అని ఆమె నినదించారు.

ఈ ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి, తల్లికి చూపించు కేటీఆర్ అని కొండా సురేఖ మండిపడ్డారు. ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్ని పార్టీల వాళ్లు తనను అక్కా అని, తన భర్తను బావ అని పిలుస్తారని అన్నారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా అని నిలదీశారు. మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడుతారా అని ప్రశ్నించారు.

Nagababu : ల‌డ్డూ వివాదం పై నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను..