Kotha Prabhakar Reddy : కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రావొద్దు నేనే వస్తాను.. బెడ్ మీద నుండే కార్యకర్తలకు కొత్త ప్రభాకర్ రెడ్డి విన్నపం

కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Kotha Prabhakar Reddy : కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రావొద్దు నేనే వస్తాను.. బెడ్ మీద నుండే కార్యకర్తలకు కొత్త ప్రభాకర్ రెడ్డి విన్నపం

Kotta Prabhakar Reddy Appeal

Updated On : November 4, 2023 / 5:31 PM IST

Kotha Prabhakar Reddy Appeal Activists : బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను కలిసేందుకు కార్యకర్తలు ఆస్పత్రికి వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యం నయం అయ్యాక తానే బయటికి వస్తానని చెప్పారు. బెడ్ మీద నుండే కార్యకర్తలకు కొత్త ప్రభాకర్ రెడ్డి విన్నపం చేశారు.

ఆస్పత్రికి సిబ్బంది, ఇతర వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని కార్యకర్తలు ఆస్పత్రికి వస్తే ఇంకా ఇబ్బంది అవుతుందని తెలిపారు. తాను ఐసీయూలోకి ఉన్నానని, ఎవరినీ లోనికి అనుమతిండం లేదని చెప్పారు. కాటట్టి కార్యకర్తలెవరూ తనను కలవడానికి ఆస్పత్రికి వద్దకు రావద్దని విజ్ఞప్తి చేశారు. తానే అక్కడికి వస్తానని చెప్పారు. కాగా, ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Telangana Government : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులకు భద్రత పెంపు.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆయనపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు.

రాజు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక ట్విస్ట్ వెలుగుచూసింది. రాజుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజుపై 307తోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్నాడు.