ఆయనే తగలబెట్టించారంటూ.. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
"మున్సిపల్ ఎన్నికల బిజీలో మనమంతా ఉంటే ఆయన కుట్రచేసి తగులబెట్టించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదం కాదు" అని తెలిపారు.
KTR
- ఒక క్రిమినల్.. సీఎం అయితే ఇలాగే ఉంటుంది
- ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఓటుకు నోటు ఆధారాలు
- సీఎం రేవంత్ రెడ్డే ఆ ల్యాబ్‌ను తగులబెట్టించారు
KTR: హైదరాబాద్, నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ హనుమకొండలో కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
“ఒక క్రిమినల్.. సీఎం అయితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూస్తున్నాం. హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడడం ఒక ఉదాహరణ. ఓటుకు నోటు ఆధారాలను అందులో భద్రపర్చారు. సీఎం రేవంత్ రెడ్డే ఆ ల్యాబ్‌ను తగులబెట్టించారు.
మున్సిపల్ ఎన్నికల బిజీలో మనమంతా ఉంటే ఆయన కుట్రచేసి తగులబెట్టించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదం కాదు. పక్కా ప్లాన్‌తో రేవంత్ రెడ్డి, ఆయన పోలీస్ ఆర్మీ చేసిన కుట్ర. ఏ పనిచేసినా రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోతారు. ఈ దొంగకు దొరికిపోవడం ఓ అలవాటు.
Also Read: ఎప్స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు? కీలక ప్రకటన చేసిన దలైలామా ఆఫీస్
పక్కా ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే క్రిమినల్.. తన క్రిమినల్ ఆలోచనతో తగలబెట్టించారు. న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు చివరి దశకు చేరింది. ఆధారాలు దొరకకుండా చేయడం కోసం తగులబెట్టించారు. ఈ క్రిమినల్ వల్ల ఇంకా అనేక మంది క్రిమినల్స్ తప్పించుకునే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. లక్కీ డ్రాలో దక్కినట్లు ఢిల్లీకి మూటలు మోసి
సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు” అని ఆరోపణలు గుప్పించారు.
