KTR Birthday Celebrations : తెలంగాణలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేతలు
కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గీతా భవన్ చౌరస్తాలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేశారు.

KTR Birthday
KTR Birthday – Cake Cutting : తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గీతా భవన్ చౌరస్తాలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేశారు.
అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత కేటీఆర్ ది అని అన్నారు. కేటీఆర్ ఆలోచన విధానాలతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని అభివర్ణించారు. కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి అయ్యిందంటే అది కేటీఆర్ చలువేనని పేర్కొన్నారు.
KTR Birthday Celebrations : విజయవాడలో ఘనంగా మంత్రి కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ అధ్యర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు.
ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే అది కేటీఆర్ చొరవేనని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కేటీఆర్ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మార్గదర్శకంలో బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.