ఒక్క పిడికిలి.. కోట్ల పిడికిల్లుగా.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

ఒక్క పిడికిలి.. కోట్ల పిడికిల్లుగా.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

Updated On : June 21, 2021 / 3:18 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం నేడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీని స్థాపించి 20ఏళ్లు అవగా, లాక్ డౌన్ కారణంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, జిల్లా కార్యాలయాల్లో టీఆర్ఎస్ శ్రేణులు హంగు, ఆర్భాటాలు లేకుండా జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తున్నారు.

కరోనా సమయంలో వేడుకలు జరపవద్దు అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులకు సూచనలు చెయ్యగా.. ఆ పార్టీ యువనేత, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తన ట్విట్టర్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఓ ట్వీట్ పెట్టారు.

“ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది
స్పూర్తి ప్రదాతా వందనం …ఉద్యమ సూర్యుడా వందనం.
20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ
ఆవిర్భావ దినోత్సావ శుభాకాంక్షలు.

జై తెలంగాణా ! జై జై కేసీఆర్!!” అంటూ ఆయన ట్వీట్ పెట్టారు.