KTR: 2025లో కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారు.. ఎక్స్‌లో కీలక విషయాలు తెలిపిన కేటీఆర్

తెలంగాణ అభివృద్ధి కోసం తాము చిత్తశుద్ధితో పనిచేశామని కేటీఆర్ చెప్పారు.

KTR: 2025లో కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారు.. ఎక్స్‌లో కీలక విషయాలు తెలిపిన కేటీఆర్

BRS Working President KTR

Updated On : October 31, 2024 / 7:23 PM IST

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఎక్స్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గ్రూప్ వన్ అభ్యర్థులకు తాము సంపూర్ణంగా మద్దతు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని చెప్పారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా మద్దతు భారీగా లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని చెప్పారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు.

తమ అందరికీ కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 2025లో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి కోసం తాము చిత్తశుద్ధితో పనిచేశామని కేటీఆర్ చెప్పారు. అందుకే తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని అన్నారు. సమయం దొరికితే వెబ్ సిరీస్ చూసి రిలాక్స్ అవుతానని చెప్పారు. వన్ షన్ వన్ ఎలక్షన్ విధానం బీజేపీ ఆడుతున్న మరో అబద్ధమని తెలిపారు.

తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం అమలు కష్ట సాధ్యమని కేటీఆర్ చెప్పారు. జాతీయ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాల్లోనే సంతోషంగా ఉన్నానని అన్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడే చర్చించడం అంత భావ్యం కాదని తెలిపారు. తన కుమారుడు హిమాన్షు అండర్ గ్రాడ్యుయేట్ బిజినెస్ చదువుతున్నారని అన్నారు.

పండుగ రోజున ఏలూరులో ఘోరం.. స్కూటీపై బాణసంచా తీసుకెళ్తుండగా పేలుడు, ఒకరు మృతి..