KTR : రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.. అందరి లెక్కలు తేల్చుతాం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
KTR : తెలంగాణలో రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. మేము అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు బయటికి తీస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR
KTR : తెలంగాణలో రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. కేసీఆర్ సీఎం అవుతారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో మాకు తెలుసు.. మేము అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు బయటికి తీస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Also Read : KTR : ‘ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ రివ్యూ.. గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అంటూ..
రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి త్వరలో మూడేళ్లు పూర్తవుతున్నా.. ప్రజల్లో నిరాశ, నిస్పృహలు పెరిగాయని అన్నారు. హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ ప్రెస్‌మీట్ పెట్టి ఏ పాట పెట్టాలి.. ఏ పాట పెట్టొద్దు అని మాట్లాడుతున్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు డీజేలు బంద్ చేయిస్తున్నరు. అణిచివేత ఎక్కువైతే సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి. అందుకే అదే సజ్జనర్, కిషన్ రెడ్డి ముందు దేక్ లెంగే అని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేశారని కేటీఆర్ అన్నారు.
ప్యారడైజ్‌లో కేసీఆర్ పాత్ర ఉన్నది నాలుగు నిమిషాలు మాత్రమే, అయినా తమకు స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చిన నాయకుడిని ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటుంది మనకు కనిపిస్తుంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ దెబ్బతిన్నది. కమీషన్ల పేరుతో వ్యవస్థను నాశనం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉండి ఉంటే రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు ఎప్పుడో వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ పూర్తిచేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్‌ను రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పార్టీ మార్పుపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. మోసం చేసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తమకు తెలుసని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లెక్కలు బయటకు తీస్తామని అన్నారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ కార్తిక్ రెడ్డి పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మూడేళ్లు అయింది.. ఒక్క ఇటుక పెట్టి ఇల్లు కట్టలేదు.. కానీ, ఫ్యూచర్ సిటీ అంటుడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ సిటీ దేనికీ పనికిరాదు.. అది ఫార్మా సిటీకి చెందుతుంది. అవి ఫార్మాసిటీకి చెందిన భూములు.. ఫ్యూచర్ సిటీ కోసం కాదు. ప్యూచర్ సిటీ నిర్మిస్తాం అంటే చట్టం ఒప్పుకోదు. రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఎవరు భూములు కొనుగోలు చేసినా మళ్లీ ఇంచు భూమి లెక్క కట్టి వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ అన్నారు.
