బీజేపీపై కేటీఆర్ సెటైర్స్ : ఏన్డీయే ఏం చేసింది ? చెప్పడానికి ఏమైనా ఉందా ?

  • Published By: madhu ,Published On : November 2, 2020 / 03:28 PM IST
బీజేపీపై కేటీఆర్ సెటైర్స్ : ఏన్డీయే ఏం చేసింది ? చెప్పడానికి ఏమైనా ఉందా ?

Updated On : November 2, 2020 / 3:57 PM IST

KTR Satirical Comments On BJP : బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సెటైర్స్ వేశారు. బీజేపీ పార్టీకి చెందిన నేత శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…ఆరు సంవత్సరాల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసందేనన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందో చెప్పడానికి గంటల సమయం పడుతుందన్నారు.



అదే కేంద్రంలో ఉన్న ఎన్డీయే ఏం చేసింది ? చెప్పడానికి ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. నోట్ల రద్దు, రైతులు వద్దు, కార్పొరేట్ మాత్రం ముద్దు ఒక్క మాటలో చెప్పాలంటే..ఇది బీజేపీ కథ అన్నారు. బీజేపీ చాలా చేస్తామని చెప్పింది..కానీ ఏం చేయలేదు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో వలస కార్మికులను ఆదుకోలేదని, బీజేపీ మాటలు మాత్రమే చెబుతుందన్నారు.



సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారు ఆరేళ్లలో అంటూ ప్రశ్నించారు. అకౌంట్లలో రూ. 15 లక్షలు ఇస్తామని చెప్పి..వేశారా అంటూ నిలదీశారు. నల్లధనం తెస్తామని చెప్పి..తేలేదని, నల్ల చట్టం తెచ్చారంటూ సైటెర్ వేశారు. వ్యవసాయ సంక్షోభానికి దారి తీసే చట్టాలు, విద్యుత్ సంస్కరణల పేరిట రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేసిందన్నారు.



రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిందన్నారు. రైతులు వద్దు – కార్పొరేట్ ముద్దు అనే విధంగా చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులను చావు దెబ్బ తీస్తున్నారని తెలిపారు. జీడీపీలో బంగ్లాదేశ్ అందరికంటే ముందుందని శ్రీలంక దేశం కూడా ముందుకు వెళుతోందని, తక్కువ జీడీపీతో ప్రపంచం ముందు భారతదేశం తలదించుకొనే పరిస్థితి నెలకొని ఉందన్నారు మంత్రి కేటీఆర్.