Wine Shops: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మూడ్రోజులు ఆ ప్రాంతాల్లో వైన్స్ బంద్.. ఎందుకంటే?
తెలంగాణలోని మందు బాబులకు బ్యాడ్‌న్యూస్. ఎందుకంటే.. మూడు రోజులు పాటు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి.

Wine Shops
Wine shops closed in Telangana: తెలంగాణలోని మందు బాబులకు బ్యాడ్‌న్యూస్. ఎందుకంటే.. మూడు రోజులు పాటు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి.
Also Read: MLC Elections : ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు కోదండరామ్ మద్దతు, ఒక చోట కాంగ్రెస్ కి..
మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలతోపాటు నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలోని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, కల్లు కంపౌండ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా క్లోజ్ కానున్నాయి. అయితే, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా మద్యం షాపులు తెరుచుకుంటాయి.
Also Read: MLC elections: పట్టభద్ర ఓటర్లూ ఈ పొరపాట్లు చేయకండి.. అవగాహనతో ఓటేయండి.. ఈ విషయాలు తెలుసుకోండి..
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కొల్లూరు, ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడ్రోజులు పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేసినా, మద్యం సరఫరా చేసినా చట్టరిత్యా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలొని కొన్ని పోలీస్ స్టేషన్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోనూ మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.