Hyderabad: మద్యం తరలిస్తున్న లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ స్థానికులు.. వీడియో

దాదాపు రూ.32 లక్షల విలువచేసే మద్యం సీసాల బాక్సులను ఎక్కించుకున్నాడు..

Hyderabad: మద్యం తరలిస్తున్న లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ స్థానికులు.. వీడియో

Viral Video

మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడడంతో సీసాలు ఎత్తుకెళ్లారు స్థానికులు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్-బోయినపల్లి పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో వెళుతోంది ఓ లారీ. కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప ఆ లారీని నడుపుతున్నాడు.

దేవరాయాంజల్లోని ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి దాదాపు రూ.32 లక్షల విలువచేసే మద్యం సీసాల బాక్సులను ఎక్కించుకున్నాడు. ఆ లారీ బోయినపల్లి చెక్ పోస్ట్ సమీపంలో లిక్కర్ మార్టుకు చేరుకుంది.

ఆ సమయంలోనే లారీ టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. లారీ బోల్తా పడి, మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. స్థానికులు వెంటనే మద్యం సీసాలను పట్టుకుని పారిపోయారు. మద్యం సీసాలను తీసుకోవాలనుకన్న మరికొందరిని డ్రైవర్ అడ్డుకున్నాడు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్