Holiday : ఫిబ్రవరి 11న సెలవు.. ఆ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థలన్నీ బంద్
Holiday : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Holiday
Holiday : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఆరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాలకే ఈ సెలవు అమలులో ఉంటుంది. పోలింగ్ రోజున స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థలన్నీ బంద్ కానున్నాయి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున సెలవు ప్రకటించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ జరిగే ఫిబ్రవరి 11న ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయాలనే ఉద్దేశంతో సంబంధిత మున్సిపల్ పరిధుల్లో స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని, పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సెలవును ప్రకటిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
