Suryapet : క్రిప్టో కరెన్సీలో నష్టం.. వ్యక్తి ఆత్మహత్య

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది.

Suryapet : క్రిప్టో కరెన్సీలో నష్టం.. వ్యక్తి ఆత్మహత్య

Suryapet (2)

Updated On : November 25, 2021 / 9:06 AM IST

Suryapet : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి (36) క్రిప్టో కరెన్సీలో బాగా లాభాలు వస్తాయని ఇద్దరు స్నేహితులతో కలిసి భారీగా పెట్టుబడి పెట్టాడు. ఇందులో నష్టం రావడంతో మనస్తాపానికి గురై మంగళవారం సూర్యాపేటకు వచ్చి ఓ లార్జీలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చదవండి : Crypto Finance : క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేస్తేనే బెటర్..పార్లమెంటరీ కమిటీ అంగీకారం

బుధవారం ఉదయం గదిలోంచి దుర్వాసన వస్తుండటంతో లార్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే మృతదేహం ఉంది. మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యకు గల కారణాలపై భార్య స్వాతి పేరిట రాసిన లేఖను పోలీసులు గుర్తించారు.

చదవండి : Crypto currency Sharia : క్రిప్టో కరెన్సీ షరియాకి విరుద్ధం అన్న ముస్లిం మత పెద్దలు..కరెన్సీపై నిషేధం విధించిన దేశం