ఆటోనా..మినీ బస్సా ఏందిది ? తెలంగాణ పోలీస్ శాఖ ఆశ్చర్యం

Mahabubnagar police shock : ఆటోనా..మినీ బస్సా ఏందిది ? అంటూ తెలంగాణ పోలీస్ శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెవెన్ సీటర్ ఆటోలో ఏకంగా…డ్రైవర్ తో కలిపి 16 మంది ప్రయాణించారు. దీనిని చూసిన పోలీసులు (Blue Colt Officers) ఆటోను ఆపి..ప్రయాణికులందరినీ దించారు. వరుసగా నిలబెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా మహబూబ్ నగర్ పోలీసు శాఖ (Mahbubnagar Police) ట్వీట్ చేసింది.
దీనిని తెలంగాణ స్టేట్ పోలీస్ (Telangana State Police) రీ ట్వీట్ చేసింది. ‘ఏందన్నా! అది ఆటో నా ?? మినీ బస్సా ?? 7 సీటరా లేక 14 సీటరా ?? ఆటో నీది!, ప్రాణం ఆ అమాయకులది!, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది??’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం చేయవద్దని, ఎక్కించుకోవద్దని పోలీసులు ఎంత అవగాహన చేస్తున్న డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది వాహన డ్రైవర్లు. ఎక్కువ మందితో ప్రయాణిస్తూ..ప్రమాదాలకు కారణమౌతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ పీఎస్ పరిధిలో ఏకంగా 17 మంది ప్రయాణించారు. బ్లూ కోల్ట్ పోలీసులు ఆపి..వరుసగా నిలబెట్టి ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. డీజిల్ ధర అమాంతం పెరిగిపోతోందని, ఈ సమస్యకు పరిష్కారం మీరే చెప్పాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొంతమంది డ్రైవర్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు.
ఏందన్నా!
అది ఆటో నా ?? మినీ బస్సా ??
7 సీటరా లేక 14 సీటరా ??
ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?? https://t.co/ks8zxgdhLy— Telangana State Police (@TelanganaCOPs) December 18, 2020