CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి చంద్రపూర్ లోని ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

CM Revanth Reddy

Updated On : November 16, 2024 / 1:43 PM IST

Maharashtra Polls 2024: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.. ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 288 నియోజకవర్గాల్లో ఈనెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు సీఎం రేవంత్ మహారాష్ట్రకు వెళ్లారు.

Also Read: Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి బాంబు బెదిరింపు..

శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి చంద్రపూర్ లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నారు. ఈ సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీలు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వాహనంలోనే కూర్చొని తనిఖీలకు పోలీసులకు సహకరించారు. అనంతరం చంద్రపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.