Mallu Bhatti Vikramarka : తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదు : మల్లు భట్టి విక్రమార్క

కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.

Mallu Bhatti Vikramarka : తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదు : మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka

Updated On : August 2, 2023 / 12:58 PM IST

Mallu Bhatti Vikramarka criticized : తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అవేవీ కనిపించడం లేదన్నారు. తన పాదయాత్రలో ప్రజల సమస్యలు కళ్ళారా చూశానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. అశాస్త్రీయంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే నిర్మించారని..

సీతారామ సాగర్ ను కూడా అలాగే నిర్మిస్తున్నారని విమర్శించారు. ఈ కారణంగానే నీళ్లు రాక పోగా వరదలు వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ప్రాజెక్ట్ డిజైన్స్ ను ఇంజనీర్లు రూపొందించాలి కానీ, ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రూ. 5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం ఉందని చెప్పారు.

Jayasudha: బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జయసుధ.. ఆ రెండు నియోజకవర్గాలపై గురి..

వరదలు, విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం స్తబ్దుగా ఉండిపోయిందని విమర్శించారు. యంత్రాంగాన్ని తమ ప్రైవేట్ ఉద్యోగులుగా మార్చడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.
కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ వ్యక్తుల మీద కాకుండా సిద్ధాంతం మీద నడుస్తోందన్నారు.

శాస్త్రీయంగా సర్వేలు చేసి, అభ్యర్థుల విజయ అవకాశాలను అంచనా వేసి అధిష్టానం టికెట్స్ ఖరారు చేస్తుందని వెల్లడించారు. ముందే హామీలు ఇవ్వడం అనేది ఉండదని, టికెట్ల ప్రకటన ఎప్పుడనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తాను చూశానని అంతకు మించి సమాచారం లేదన్నారు. అంతా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.