మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో దారుణం.. ఎస్ఐ అత్యుత్సాహం.. కేటీఆర్, హరీశ్ ఆగ్రహం

కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ డీజీపీకి కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా పోస్టు చేసినందుకు ..

Maloth Suresh Babu

Mahabubabad District : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పీఏ మెప్పుకోసం తొర్రూరు ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించిన యువకున్ని బాదాడు. తొర్రూరు పోలీస్ స్టేషన్ లోనే యువకుడు మాలోత్ సురేష్ పై థర్డ్ డిగ్రీని ఎస్ఐ ప్రయోగించాడు. ఎమ్మెల్యే పీఏను కూర్చోబట్టి అతని ముందే తనను ఎస్ఐ చితకబాదాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?

తన కొడుకుని చిత్రహింసలు పెట్టిన ఎస్సై జగదీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. బాధితుడికి న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. బాధితుడి స్వగ్రామం రాయపర్తి మండలం సన్నూరు. విషయం తెలిసిన వెంటనే బాధితుడు సురేష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. తాజా ఘటనపై విద్యార్థి, గిరిజన సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

Also Read : హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం.. ఈసారి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద

కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ డీజీపీకి కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా పోస్టు చేసినందుకు యువకులను పోలీసులు ఎత్తుకెళ్లే వరకు సంఘటనలను చూసి నేను చాలా బాధపడ్డాను. మాలోత్ సురేష్ బాబు అనే గిరిజన యువకుడిని తొర్రూరు పోలీసులు పట్టుకొని నిర్ధాక్షిణ్యంగా చిత్రహింసలు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పీఏని విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టులపై పనికిమాలిన ఫిర్యాదుల ఆధారంగా బీఆర్ఎస్ క్యాడర్ ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తున్న సందర్భాలు కూడా పెరుగుతున్నాయి. కొందరు పోలీసులు మితిమీరిన ప్రవర్తనతో అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారు. చట్టవిరుద్దమైన వారి ప్రవర్తనను ఆపడానికి మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని అభ్యర్ధిస్తున్నాను అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరం. తొర్రూరు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నట్లు చెప్పారు.