హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం.. ఈసారి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద

హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గురువారం అర్థరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు.

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం.. ఈసారి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద

Police Gun Fire At Nampally Railway station

Updated On : July 12, 2024 / 7:53 AM IST

Gun Fire At Nampally Railway station : హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గురువారం అర్థరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అనుమానాస్పదంగా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఓ వ్యక్తి తప్పించుకునేందుకు పారిపోతున్న క్రమంలో పోలీస్ డెకాయ్ టీమ్ కాల్పులు జరిపింది.

Also Read : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అర్ధరాత్రి ఆందోళన.. ఘటనకు నిరసనగా జూడాల సమ్మె

పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తికి గాయాలు కాగా.. మరో ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉండటంతో అతనికోసం గాలిస్తున్నట్లు తెలిసింది. కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తులు ఎవరు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నించారు. పోలీసులపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, వారంతా దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. తాజా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?

ప్రదాన మార్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. సినిమా సీన్ తరహాలో ఘటన చోటుచేసుకోవటంతో ఏం జరుగుతుందో కొద్దిసేపు ప్రయాణికులకు అర్థంకాక కంగారు పడిపోయారు. ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటన నగరవాసులు మర్చిపోకముందే మరోసారి నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.