ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి

ఇటీవలే అరవింద్ తల్లి హైదరాబాద్ వచ్చారు. అరవింద్ యాదవ్ కనపడడం లేదని..

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి

Man from Shadnagar dies

Updated On : May 24, 2024 / 1:09 PM IST

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. షాద్‌నగర్‌కు చెందిన ఓ పార్టీ దివంగత నాయకుడి కుమారుడు అరటి అరవింద్ యాదవ్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఐదు రోజుల క్రితం అతడు కనపడకుండాపోయాడు.

అతడి కోసం గాలిస్తున్న పోలీసులకు సముద్రంలో అరటి అరవింద్ మృతదేహం లభ్యమైంది. అరవింద్‌ యాదవ్‌ కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోంది. గత 12 ఏళ్ల నుంచి ఆస్ట్రేలియాలో అరవింద్ యాదవ్ ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితమే షాద్‌నగర్‌కు చెందిన అమ్మాయితో అరవింద్ పెళ్లి జరిగింది.

అనంతరం అరవింద్ యాదవ్‌ తన తల్లి, భార్యతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఇటీవలే అరవింద్ తల్లి హైదరాబాద్ వచ్చారు. అరవింద్ యాదవ్ కనపడడం లేదని హైదరాబాద్ లోని అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది.

దీంతో వారు ఆస్ట్రేలియా అధికారులకు ఫిర్యాదు చేశారు. అరవింద్ కారును బీచ్‌ ఒడ్డున, అతడి మృతదేహాన్ని సముంద్రలో పోలీసులు గుర్తించారు. అరవింద్ తండ్రి కూడా 2006లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అరవింద్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బెంగళూరు రేవ్ పార్టీ.. వెలుగులోకి మరిన్ని షాకింగ్ విషయాలు