బెంగళూరు రేవ్ పార్టీ.. వెలుగులోకి మరిన్ని షాకింగ్ విషయాలు

రూ. 2లక్షలతో ఒక మధ్య తరగతి కుటుంబం ఏడాది పాటు అవసరాలు తీరతాయి. కానీ, బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న బడాబాబులు ఓ టికెట్ కోసం ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టారు.

బెంగళూరు రేవ్ పార్టీ.. వెలుగులోకి మరిన్ని షాకింగ్ విషయాలు

Bangalore Rave Party : ఎన్నికలు తర్వాత హడావుడి ముగిసిన దగ్గరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం రేవ్ పార్టీ. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో సన్ సెట్ టు సన్ రైజ్ పేరుతో జరిగిన ఈ రేవ్ పార్టీ.. టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మందు, మత్తు, మజా మాత్రమే రేవ్ పార్టీలో ఉందని భావించిన పోలీసులకు దర్యాఫ్తులో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

రేవ్ పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్నది నిర్ధారించేందుకు పోలీసులు జరిపించిన బ్లడ్ శాంపుల్స్ లో 86మందికి పాజిటివ్ వచ్చింది. రేవ్ పార్టీని నిర్వహించింది తెలుగు వాళ్లే. దొరికిన వారిలో ఎక్కువమందీ తెలుగువారే. రేవ్ పార్టీ మూలాలు విజయవాడ, చిత్తూరులో బయటపడటం సంచలనంగా మారింది. ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనపడుతోంది.

ఒక టికెట్ ఖరీదు రూ.2లక్షలు..
2లక్షల రూపాయలతో ఒక మధ్య తరగతి కుటుంబం ఏడాది పాటు అవసరాలు తీరతాయి. కానీ, బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న బడాబాబులు ఓ టికెట్ కోసం ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. అంటే వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సెలెబ్రిటీలు, సంపన్నులు, వారి పిల్లలు ఆనందాన్ని వెతుక్కునే రేవ్ పార్టీలపై భారత్ లో నిషేధం ఉంది. అందుకే అత్యంత రహస్యంగా ఈ పార్టీలు నిర్వహించుకుంటూ ఉంటారు.

కానీ, పోలీసుల దాడులతో చాలామంది బండారం బయటపడింది. రేవ్ పార్టీ మూలాలు ఏపీలో తేలాయి. రేవ్ పార్టీ నిర్వాహకులు విజయవాడ, చిత్తూరుకు చెందిన వారంటే.. ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఎంత విచ్చలవిడిగా వ్యాపించిందో అర్థమవుతోంది.

Also Read : తినడానికే గతి లేదు..! ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? రేవ్ పార్టీ వాసు గురించి సంచలన విషయాలు