Karimnagar : మరణంలోనూ వీడని బంధం.. గుండెపోటుతో భార్య మృతి.. తట్టుకోలేక కన్నుమూసిన భర్త

అంతలోనే సత్తవ్వకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. బంధువులు, గ్రామస్థులు సత్తవ్వకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

Karimnagar : మరణంలోనూ వీడని బంధం.. గుండెపోటుతో భార్య మృతి.. తట్టుకోలేక కన్నుమూసిన భర్త

Couple Dead

Updated On : June 13, 2023 / 9:07 AM IST

Couple Dead : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో విషాధకరమైన ఘటన చోటు చేసుకుంది. భార్య గుండెపోటుతో మృతి చెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త కన్నుమూశారు. లో సోమవారం చోటుచేసుకున్నది. బూరుగుపల్లికి చెందిన జోగుల పోచయ్య (61), సత్తవ్వ (55) దంపతులు. పోచయ్య మూడు నెలల క్రితం పక్షవాతంతో మంచం పట్టాడు.

వీరికి పిల్లలు లేకపోవడంతో సత్తవ్వ అన్నీ తానై భర్తను కన్నబిడ్డలా సాకింది. సత్తవ్వ కూలీ పనులు చేసుకుంటూ భర్తను పోషించుకుంటున్నారు.  సోమవారం ఉదయం 8:30 గంటలకు పోచయ్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా అతని పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్న సత్తవ్వ కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.

Dayakar Reddy Passed away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

అంతలోనే సత్తవ్వకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. బంధువులు, గ్రామస్థులు సత్తవ్వకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. భార్య మరణాన్ని తట్టుకోలేక పోచయ్య సైతం అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మృతి చెందాడు.

ఇద్దరి మృతదేహాలను ఒకే దగ్గర ఖననం చేశారు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో బంధువులు, గ్రామస్థులు బోరున విలపిస్తున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.