Hyderabad : ప్రేయసి చేతిలో మోసపోయిన వివాహితుడు.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో సూసైడ్

ప్రేయసి మోసం చేసిందని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

Hyderabad : ప్రేయసి చేతిలో మోసపోయిన వివాహితుడు.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో సూసైడ్

Hyderabad

Updated On : August 22, 2021 / 12:17 PM IST

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఓ వ్యక్తి పేస్ బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు, తనను ప్రేయసి, స్నేహితుడు ఇద్దరు మోసం చేశారంటూ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బ్రహ్మం (36) కి భార్య ఇద్దరు పిల్లలు. బ్రహ్మంకి లారీలు ఉన్నాయి. కరోనా కారణంగా వ్యాపారంలో నష్టపోయిన బ్రహ్మం శనివారం స్నేహితుడు వేణుగోపాల్ తో కలిసి హైదరాబాద్ వచ్చాడు. వనస్థలిపురంలోని వీఎంఆర్‌ లాడ్జ్‌ అండ్‌ బార్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం ఇద్దరు కలిసి అక్కడే మద్యం తాగి గదికి వెళ్లి పడుకున్నారు.

సాయంత్రం వేణుగోపాల్ మధ్య తాగేందుకు బార్ కి వెళ్ళాడు. ఇదే సమయంలో బార్ కి రావాలంటూ బ్రహ్మంకి ఫోన్ చేశాడు. ఫోన్ తీయలేదు. అదే సమయంలో అతడు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకుంటున్నాని చెబుతూ గదిలోని సీలింగ్‌ ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొన్నాడు.

పేస్ బుక్ లైవ్ చుసిన స్నేహితులు బంధువులు అనేక సార్లు ఫోన్ చేశారు.. అయినా బ్రహ్మం ఫోన్ తీయలేదు. ఫోన్ తీయకపోవడంతో వేణుగోపాల్ పైకి వెళ్లి చూడగా డోర్ లాక్ చేసి ఉంది. కిటికీలోంచి చూడగా బ్రహ్మం ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు.. వెంటనే అతడు లాడ్జ్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. డోర్ పగలగొట్టి చూడగా అప్పటికే బ్రహ్మం మృతి చెందాడు. లాడ్జ్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.