KA Paul : రేవంత్ రెడ్డిని సీఎం చేయమని బండ్ల గణేష్ సహా పలువురు నాకు ఫోన్లు చేస్తున్నారు : కేఏ పాల్

వైస్సార్టీపీ కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు.

KA Paul : రేవంత్ రెడ్డిని సీఎం చేయమని బండ్ల గణేష్ సహా పలువురు నాకు ఫోన్లు చేస్తున్నారు : కేఏ పాల్

KA Paul Sensational Comments

Updated On : November 8, 2023 / 10:42 AM IST

KA Paul Sensational Comments : ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయమని బండ్ల గణేష్ సహా పలువురు తనకు ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు.

77 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో 11 మంది రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడు 12వ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి తనకు అనేక మంది ఫోన్ కాల్స్ చేశారని తెలిపారు. అమెరికా నుంచి 16 మంది తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఫోన్లు చేసిన వారిలో ఈ 16 మంది కమ్మ కమ్యూనిటీకి చెందిన నాయకులు, అమెరికాకు చెందిన ఒక పెద్ద సంస్థ ప్రెసిడెంట్, గత ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉన్నారని పేర్కొన్నారు.

KA Paul : రాహుల్ గాంధీ నాకు కాల్ చేసి మద్దతు అడిగారు.. ఇవ్వనని చెప్పాను : కేఏ పాల్

తమకు ఢిల్లీలో మోదీ శత్రువు, తెలంగాణలో కేసీఆర్ శత్రువు, ఆంధ్రాలో జగన్ శత్రువు అని ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. చంద్రబాబు శిశ్యుడైన రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని, దానికి తాము వంద కోట్లు, వెయ్యి కోట్లు ఎంతకైనా ఖర్చు పెడతామని ఫోన్ లో చెప్పినట్లు పేర్కొన్నారు.

మొదటి కాల్ బండ్ల గణేష్ నుంచి వచ్చిందన్నారు. బండ్ల గణేష్ అనే పేరు విన్నాను కానీ, ఆయనెవరూ తనకు తెలియదన్నారు. ‘బండ్ల గణేష్ ఫోన్ చేసి నేను మీ ఫాలోవర్ ను, మీరంటే మాకు దైవమని’ అన్నారని చెప్పారు. తనకు ఫోన్ చేసిన వారి నెంబర్స్, ఇన్ కమింగ్ కాల్స్ వివరాలను మీడియాకు వెల్లడించారు.

వైస్సార్టీపీ కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు. అలాగే కోదండరాం రెడ్డి కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారని ముందే చెప్పానని పేర్కొన్నారు. నిన్న కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తనకు ఫోన్ చేసి మద్దతు అడిగారని… తాను ఇవ్వనన్నాను అని తెలిపారు.