పెళ్లింట్లో భారీ దొంగతనం..200 తులాల బంగారం, రూ.8లక్షలు చోరీ

పెళ్లింట్లో భారీ దొంగతనం..200 తులాల బంగారం, రూ.8లక్షలు చోరీ

Updated On : December 19, 2020 / 2:12 PM IST

Massive theft in wedding’s home : మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం బోయినపల్లిలో భారీ దొంగతనం జరిగింది. పెళ్లింట్లో దొంగలు పడ్డారు. 2వందల తులాల బంగారాన్ని, 8లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది.

మరో మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. కూతురి వివాహం కోసం తెచ్చిన నగలతో పాటు కుటుంబ సభ్యుల ఆభరణాలు ఒకే చోట ఉంచారు. అయితే అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు మొత్తం దోచుకెళ్లారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.