TSRTC: 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎండీ సజ్జనార్ హర్షం

దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు

TSRTC: 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎండీ సజ్జనార్ హర్షం

MD Sajjanar: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ సోమవారం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. విధివిధానాలు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదని ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.


ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే.. ఆయన తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ ‘‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇది. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తూ..’’ అని ట్వీట్ చేశారు.