మళ్లీ రెండేళ్లకు : నేటితో ముగియనున్న మేడారం జాతర

మేడారం మహాజాతర నేటితో(ఫిబ్రవరి 08,2020) ముగియనుంది. ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 03:42 AM IST
మళ్లీ రెండేళ్లకు : నేటితో ముగియనున్న మేడారం జాతర

Updated On : February 8, 2020 / 3:42 AM IST

మేడారం మహాజాతర నేటితో(ఫిబ్రవరి 08,2020) ముగియనుంది. ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా

మేడారం మహాజాతర నేటితో(ఫిబ్రవరి 08,2020) ముగియనుంది. ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా మేడారం పరిసర ప్రాంతాలు మారిపోయాయి. ఇప్పటికే, లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆరాధ్య దేవతల దర్శనానికి భక్త కోటి పోటెత్తింది. ఇసుకేస్తే రాలనంత జనంతో మేడారం కిక్కిరిసిపోయింది. తల్లులను దర్శించుకునేందుకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబంతో సహా.. గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు జాతరకు ఆఖరి రోజు కావడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది. 

బుధవారం(ఫిబ్రవరి 05,2020) నాడు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి తీసుకొచ్చారు. సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చే క్రతువు కోలాహలంగా సాగింది. మేడారం సమీపంలోని కన్నెపల్లి గ్రామంలో సారలమ్మ గుడి నుంచి పూజారులు డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి జంపన్న వాగులో నుంచి నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. మరోవైపు ఏటూరునాగారం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇలా మొదటి రోజు సారలమ్మ ఆమె తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మహా జాతర తొలిరోజు క్రతువు ముగిసింది.

గురువారం నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దిగి వచ్చి గద్దెపై ఆశీనురాలైంది. చిలకలగుట్టపై నుంచి మేడారం గద్దెల వరకు సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం ఉద్విగ్నభరితంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగింది. సమ్మక్క పూజారులను దైవాంశ సంభూతులుగా భావించి భక్తులు వారిని తాకేందుకు పోటీపడ్డారు. పెద్దమ్మ రాకతో గద్దెలు కొత్త కళను సంతరించుకొన్నాయి. దేవేరుల కుటుంబమంతా మేడారం ఆలయంలోని గద్దెలపై కొలువుదీరడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాడు ఇసుకేస్తే రాలనంత జనంతో మేడారం కిక్కిరిపోయింది. మేడారం జాతరలో నాలుగో రోజు అయిన ఇవాళ(ఫిబ్రవరి 08).. దేవతల వన ప్రవేశ క్రతువుతో జాతర ముగుస్తుంది. 

* నేటితో ముగియనున్న మేడారం మహాజాతర 
* ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో ముగియనున్న మహాక్రతువు 
* కుంభమేళాను తలపించే విధంగా మారిన మేడారం పరిసర ప్రాంతాలు
* వనదేవతలను దర్శించుకున్న లక్షల మంది భక్తులు

* బుధవారం నాడు గద్దెపైకి సారలమ్మ, గోవిందరాజు
* కన్నెపల్లి నుంచి మేడారానికి సారలమ్మ
* కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు
* గురువారం నాడు చిలకలగుట్ట నుంచి వచ్చిన సమ్మక్క 
* సమ్మక్కను తాకేందుకు పోటీపడ్డ భక్తులు