Meru International School : విద్యార్థుల్లో ప్ర‌తిభ‌ను చాటేలా.. మేరు ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ క్రీడా పోటీలు

హైద‌రాబాద్‌లోని మేరు ఇంట‌ర్నేష‌నల్ స్కూల్.. మేరు ఇంట‌ర్ క‌మ్యూనిటీ క్రీడా పోటీల‌ను నిర్వ‌హించింది.

Meru International School : విద్యార్థుల్లో ప్ర‌తిభ‌ను చాటేలా.. మేరు ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ క్రీడా పోటీలు

Meru International School Hosts Meru Vijetha Inter Community Sports Competition

హైద‌రాబాద్‌లోని మేరు ఇంట‌ర్నేష‌నల్ స్కూల్.. మేరు ఇంట‌ర్ క‌మ్యూనిటీ క్రీడా పోటీల‌ను నిర్వ‌హించింది. విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని పెంపొందించేలా, వారిలోని ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు తీసుకురావాల‌నే ఉద్దేశంతో ఈ క్రీడ‌ల‌ను నిర్వ‌హించింది. ఈ పోటీల్లో 40 కంటే ఎక్కువ క‌మ్యూనిటీలు, 800 ల‌కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

30 మీటర్ల డ్యాష్‌, బాస్కెట్‌బాల్ షాట్స్‌, ఇంటెన్స్ బాస్కెట్ బాల్ మ్యాచ్‌లు, బ్యాడ్మింట్ వంటి ఆట‌ల‌ను నిర్వ‌హించారు. విద్యార్థుల్లోని ప్ర‌తిభ బ‌య‌టి ప్ర‌పంచానికి చాటేందుకు ఈ వేదిక ఎంతగానో ఉప‌యోగ‌ప‌డింద‌ని, ఈ పోటీల‌కు త‌ల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి ఎంతో స‌హ‌కారం ల‌భించింద‌ని స్కూల్ వ‌ర్గాలు తెలిపాయి.

అకాడ‌మీతో పాటు క్రీడ‌ల‌కు పెద్దపీట వేస్తూ మేరు ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. యువ‌త‌లో క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు కృషి చేస్తోంది. శారీర‌క ధృడ‌త్వం ఆట‌ల ద్వారా పెంపొందించుకోవ‌చ్చు. బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) నుండి రిఫ‌రీలు ఈ పోటీల‌కు హాజ‌రు అయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) నుంచి ప్ర‌తినిధులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. వారి నైపుణ్యం, నిప్ప‌క్ష‌పాత తీర్పు కార‌ణంగా క్రీడ‌లు మ‌రింత ప్రొపెష‌న‌లిజంగా మారాయని, ఇంట‌ర్ క‌మ్యూనిటీ క్రీడా పోటీలు విజ‌య‌వంతం కావ‌డం త‌మ పాఠశాల యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుందని స్కూల్ వ‌ర్గాలు తెలిపాయి.

మేరు ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ విష‌యానికి వ‌స్తే.. నాణ్య‌మైన విద్య‌ను అందిస్తూ విద్యార్థుల‌ను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. న‌ర్స‌రీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థులు ఉన్నారు. మియాపూర్‌, తెల్లాపూర్‌ల‌లో బ్రాంచీలు ఉన్నాయి. కేంబ్రిడ్జ్, సీబీఎస్ఈ సిల‌బ‌స్‌లో విద్యను అందిస్తున్నారు. మిగ‌తావాటిలో పోలిస్తే.. విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలో మేరు ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.