Telangana Rain : తెలంగాణలో రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లోనూ.. వాతావరణ రిపోర్ట్ ఇదే..
Telangana Rain రాష్ట్రంపై దిత్వాహ్ తుఫాను ఎఫెక్ట్ స్వల్పంగా ఉంటుందని, తుఫాను ప్రభావంతో సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని
AP Rains
Telangana Rain : దిత్వాహ్ తుపాన్ ప్రభావం తెలంగాణపైనా పడింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వాహ్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. సోమవారం ఉదయం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని దక్షిణ, తూర్పు ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వెల్లడించింది.
రాష్ట్రంపై దిత్వాహ్ తుఫాను ఎఫెక్ట్ స్వల్పంగా ఉంటుందని, తుఫాను ప్రభావంతో సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం కూడా రాష్ట్రంలో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాదారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ త క్కువగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో అత్యధికంగా 30.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8.2 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా న మోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
