Michaung Cyclone Effect : మిగ్‌జామ్‌ తుఫాన్ ఎఫెక్ట్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం.. నేలకొండపల్లిలో విషాదం

మిగ్‌జామ్‌ తుపాను తీరందాటినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో

Michaung Cyclone Effect : మిగ్‌జామ్‌ తుఫాన్ ఎఫెక్ట్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం.. నేలకొండపల్లిలో విషాదం

Michaung Cyclone

Updated On : December 6, 2023 / 9:03 AM IST

Michaung Cyclone Khammam District : ఏపీలో తీరందాటిన తీవ్ర తుపాను మిగ్‌జామ్‌ ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీకి ఆనుకొనిఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మిగ్‌జామ్‌ ప్రభావం పడింది. జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వారావుపేట మండలంలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేటలో భారీ వర్షానికి పెదవాగు ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నుంచి 4028 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. బలహీనపడిన మిగ్‌జామ్‌ తీవ్ర తుపాను వాగుండంగా ఖమ్మంకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read : Cyclone Michaung : తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి ..
మిగ్‌జామ్‌ తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. వర్షానికి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 30వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, లక్ష80వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడింది. కిష్టారం ఓసీలో 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 30వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు అంతరాయం ఏర్పడింది. మిగ్‌జామ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పంట నీటమునిగింది. వరితోపాటు పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిళ్లడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో విషాదం చోటు చేసుకుంది. వర్షానికి ఇంటిగోడ కూలి ఇద్దరు మృతిచెదారు.

Also Read : Balakrishna : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు

ఇవాళకూడా వర్ష సూచన ..
మిగ్‌జామ్‌ తుపాను తీరందాటినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రమంతా జల్లులు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.