దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నా : మంత్రి హరీష్ రావు

  • Published By: bheemraj ,Published On : November 10, 2020 / 07:28 PM IST
దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నా : మంత్రి హరీష్ రావు

Updated On : November 10, 2020 / 7:56 PM IST

minister harishrao respond : దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.



టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, తన పక్షాన ఎల్లవేళలా ప్రజలకు కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.



నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తల కోసం, దుబ్బాక ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తుందని చెప్పారు. గెలుపు ఓటములు ఉన్నప్పటికీ ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు.



ఓటమికి గల కారణాలేంటనేదానిపై లోతుగా సమీక్షించుకుంటామని తెలిపారు. కార్యకర్తలు బాగా కష్టపడి పని చేశారని పేర్కొన్నారు.