Telangana:‘గవర్నర్ గవర్నర్ లాగానే వ్యవహరిస్తే గౌరవిస్తాం..లేదంటే పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు’:మంత్రి జగదీష్ రెడ్డి
‘గవర్నర్ గవర్నర్ లాగానే వ్యవహరిస్తే గౌరవిస్తాం..లేదంటే పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Minister Jagadish Reddy Countered Of Telangana Governor Tamilsai
Telangana: ‘తనను వ్యక్తిగతంగా అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి తెలంగాణ ప్రభత్వం మర్యాద ఇవ్వాలని..మహిళా గవర్నర్ ను కాబట్టి అవమానిస్తున్నారని.. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అనంతరం మీడియాకు వెల్లడించారు తమిళిసై. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ పై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..గవర్నర్ గవర్నర్ లాగానే వ్యవహరిస్తే..గౌరవిస్తాం..కాదని రాజకీయ దురుద్దేశ్యంతో వ్యవహరిస్తే పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు
అని అన్నారు.
మొదట్లో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించారు… కానీ ఇటీవల కాలంలో గవర్నర్ బీజేపీ నాయకురాలిగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోందని అన్నారు. యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు కూడా గవర్నర్ తమిళిసై బీజేపీ నాయకురాలిగానే వచ్చారని అన్నారు. రాజ్యంగంలో ప్రభుత్వానికి, గవర్నర్ వ్యవస్థకు చాలా స్పష్టమైన అధికరాులు ఉన్నాయని..అటువంటి పరిధిని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ దాటలేదని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.
బీజేపీ గవర్నర్ ద్వారా రాష్ట్రంలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటోందని..అందుకే ప్రభుత్వానికి, గవర్నర్ కు గ్యాప్ వస్తోంది అన్నారు. సేవా కోటాలు అంటే రాజకీయాలు రావా? అని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.