ఆ కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయింది- లాయర్ అశోక్ రెడ్డి
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా కామెంట్స్ చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదనలు వినిపించారు.

Akkineni Nagarjuna Petition (Photo Credit : Google)
Akkineni Nagarjunas Defamation Case : హైదరాబాద్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. నాగార్జునపై మంత్రి కొండా సురేఖ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని కోర్టుకు వివరించారు. ఆ కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని చెప్పారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణ కోరారని, కొండా సురేఖ చేసిన ట్వీట్ ను చదివి వినిపించారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా కామెంట్స్ చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదనలు వినిపించారు. తన పరువుకు భంగం కలిగేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారంటూ నటుడు నాగార్జున కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పరువు నష్టం దావా కేసులో ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూ కొండా సురేఖ గతంలో వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరుపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో కొండా సురేఖ తరుపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ పై మరోసారి ఇవాళ నాంపల్లి స్పెషల్ కోర్టులో ఆర్గుమెంట్స్ జరిగాయి.
నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ట్విట్టర్ లో పేర్కొన్నవి.. అన్ని అంశాలను కోర్టు ముందు మరోసారి ప్రస్తావించారు. కొండా సురేఖ కావాలనే నాగార్జున పరువు ప్రతిష్ట దెబ్బతీశారని, ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్ట విరుద్ధం అని, కచ్చితంగా ఆమెపై క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కోర్టు చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి మరోసారి వాదనలు వినిపించారు.
Also Read : కేసీఆర్ ఏం ప్లాన్ వేస్తున్నారు? దానికి రేవంత్ దగ్గరున్న విరుగుడు ఏంటి?