Minister KTR : ఎన్నికల్లో పైసలు ఇవ్వా,మందు పోయా,మీరు కోరుకుంటే సిరిసిల్లో ఉంటా : కేటీఆర్

ఒక్క తరం చదువుకుంటే... ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారు. పిల్లలు బాగా చదవుకోవాలి. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు. అమెరికాలోను సమస్యలున్నాయి..అక్కడా పేదవారున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం..ఎవరో వచ్చి ఏదో చెబితే ఆగం కావద్దు.

Minister KTR : ఎన్నికల్లో పైసలు ఇవ్వా,మందు పోయా,మీరు కోరుకుంటే సిరిసిల్లో ఉంటా : కేటీఆర్

Minister KTR

Minister KTR Computer Champs program : తన సొంత నియోజక వర్గం అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ (Minister KTR) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. రూ.8కోట్లతో ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించారు. కంప్యూటర్ చాంప్స్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు..అభివృద్ధి నినాదంతోనే ఎన్నికల్లో ఓట్లు అడుగతామని.. అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది అని అన్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, సాగునీరు, తాగునీరు సౌకర్యాల విషయంలో ఎంతగానో అభివద్ధి చెందింది అని తెలిపారు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయన్నారు. రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించనవారు ఏం చేశారు? అంటూ కాంగ్రెస్ పాలనను ఉద్ధేశించి విమర్శించారు. ఇకపోతే బీజేపీ..రాష్ట్రానికి అది చేశాం. ఇది చేశాం అని గొప్పలు చెబుతారు..కానీ బీజేపీ తెలంగాణకు ఏం చేసింది? బీజేపీ ఎంపీ నియోగకవర్గానికి అరపైసా అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.

MLA Muthireddy : ప్రజల ముందే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీసిన కూతురు .. వదిలేదిలేదంటూ వార్నింగ్

కానీ బీఆర్ఎస్ పార్టీ అలా కాదు అభివృద్ధి చేసే ఓట్లు అడుగుతామని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచను..మద్యం తాగించను..అభివృద్ధి చేసే ఓట్లు అడుగుతానని కేటీఆర్ అన్నారు. ఒక్క తరం చదువుకుంటే… ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారని అన్నారు. పిల్లలు బాగా చదవుకోవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తెలగాణకు చెందిన విద్యార్ధులు ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు.ఎవడో వచ్చి నాలుగు స్పీచ్ ఇవ్వగానే ఆగం కావొద్దు అంటూ సూచించారు. ప్రతీ రాష్ట్రంలోను సమస్యలుంటాయి. అగ్రదేశం అని చెప్పుకునే అమెరికాలో కూడా సమస్యలున్నాయి అక్కడ కూడా పేదవారున్నారు. కానీ ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటు ముందుకుపోవాలన్నారు. రాష్ట్రంలో సమస్యలుంటే పరిష్కరించుకుందామన్నారు.

Rythu Bandhu : రైతులకు గుడ్‌న్యూస్.. 26న వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

మీ ఎంపీ తన నియోజకవర్గానికి అరపైసా అయినా నిధులు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఏ..మోదీని అడిగి నిధులు తీసుకురావచ్చు కదా?మెడికల్, నర్సింగ్ కలశాల,నవోదయ స్కూల్స్ కేంద్రం తెలంగాణకు ఇవ్వదు.. ఒక్క సాయం అయిన అందిందా? అని ప్రశ్నించారు. కానీ కేసీఆర్ కృషితో ఎన్నో ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎల్లారెడ్డి పేట కు డిగ్రీ కాలేజ్ వస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ అనుకుంటే ఏదైనా వస్తదన్నారు. దిష్టి బొమ్మలకు ఉరి వేసి చిల్లర పనులు చేస్తారు అదికాదు కావాల్సింది చేయాల్సింది అభివృద్ధి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. మీ దయ ఉంటే గెలుస్తా. ఎన్నికల్లో పైసలు ఇవ్వా…మందు పోయా..ప్రజలు కోరుకుంటే సిరిసిల్లో ఉంటా…పలకతో రా పట్టా తీసుకొని పొమ్మని అంటున్నాం అది మన ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చే ప్రోత్సాహం అని అన్నారు మంత్రి కేటీఆర్.