కవిత పోరాటం.. రాజకీయ ఉనికి కోసమే : మంత్రి పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తుందని, వార్తల కోసమే లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ..

కవిత పోరాటం.. రాజకీయ ఉనికి కోసమే : మంత్రి పొన్నం ప్రభాకర్

Updated On : June 4, 2025 / 12:52 PM IST

Ponnam Prabhakar: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తుందని, వార్తల కోసమే లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కవిత అంశం టీ కప్పులో తుఫాను లాంటిందని అన్నారు.

 

కేటీఆర్, కవిత పంచాయతీ కాంగ్రెస్ కు అవసరం లేదని, విచారణకు ఎవరిని పిలవాలనేది కాళేశ్వరం కమిషన్ ఇష్టమని పొన్నం అన్నారు. నీళ్లు ఇస్తే సంతోషమే.. కానీ, నీళ్లలా తెలంగాణ ధనాన్ని బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నారని ఆయన విమర్శించారు.

 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం గాంధీ భవన్ లో ఏర్పాటు చేశారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఉపయోపగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది.

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు.. హన్ముంతుని గుడి లేని గ్రామం లేదు అనే నానుడి ఉండేది. మళ్లీ అదే నినాదంతో పనిచేస్తున్నాం అని పొన్నం ప్రభాకర్ అన్నారు.

Also Read: కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే.. చంద్రబాబు నీళ్లు ఎత్తుకెళ్తుంటే రేవంత్ ఏం చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత