Kcr : మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

నేతలు సమయం ఇస్తే ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.

Kcr : మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

Updated On : December 6, 2024 / 10:55 PM IST

Kcr : సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఆహ్వానాలు పంపుతామని ఆయన తెలిపారు. దీని కోసం సమయం ఇవ్వాలని వారిని కోరుతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. నేతలు సమయం ఇస్తే ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.

”నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా ఆహ్వానించేందుకు వారి వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి, సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం. వాళ్లు సమయం ఇచ్చిన ప్రకారం వారిని కలిసి ఆహ్వానపత్రాలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా వారందరికి తెలంగాణ ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

రేపు (శనివారం) ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ తో పొన్నం భేటీ కానున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించనున్నారు.

 

 

Also Read : తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే..! కొత్త విగ్రహంలో ఏమేం మార్పులు చేశారంటే..