Telangana Thalli New Statue : తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే..! కొత్త విగ్రహంలో ఏమేం మార్పులు చేశారంటే..
కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలు ఉన్నాయి.

Telangana Thalli New Statue : తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి భిన్నంగా కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం, బంగారు హారాలు, నెక్లెస్, చెవికి కమ్మలతో ఉండగా.. కొత్త విగ్రహ రూపంలో తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. మరో చేత్తో అభయ హస్తంతో ఉన్నట్లు ప్రభుత్వం ఫోటోను విడుదల చేసింది.
ఎర్ర చీరతో పాత తెలంగాణ తల్లి రూపంలో ఉండగా.. ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. ఆకుపచ్చ చీరతో తెలంగాణ కొత్త తల్లి రూపం ఉండగా.. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు.. కుడి చేతిలో అభయహస్తంతో కొత్త విగ్రహం ఉంది. పాత విగ్రహంలో నడుము వద్ద వడ్డానం, మెడలో నగలు, చేతికి బంగారు గాజులు, తలకు కిరీటం ఉంది. కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలు ఉన్నాయి. చేతికి మట్టి గాజులు ఉండగా.. తలకు కిరీటం లేదు.
ముక్కు పుడకలో రత్నం పొదిగినట్లు పాత విగ్రహం ఉండగా.. కొత్త విగ్రహంలో సాధారణ ముక్కు పుడక మాత్రమే ఉంది. దేవతా రూపంతో పాత విగ్రహం ఉండగా.. సాధారణ గృహిణి రూపంలో నూతన విగ్రహం ఉంది.
కొత్త విగ్రహ రూపం- పాత విగ్రహ రూపంలో తేడాలు..
* తలకు కిరీటం లేదు – తలకు కిరీటం
* సాధారణ గృహిణి రూపం – దేవతా రూపం
* సాధారణ ముక్కుపుడక – ముక్కుపుడకలో రత్నం
* ఆకుపచ్చ చీర – ఎర్ర చీర
* ఎడమ చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు – ఎడమ చేతిలో బతుకమ్మ
* కుడి చేతితో అభయహస్తం – కుడి చేతిలో మొక్కజొన్న, సజ్జ కంకులు
* కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలు – నడుము వద్ద వడ్డాణం, మెడలో నగలు
* చేతికి మట్టి గాజులు – చేతికి బంగారు గాజులు
Also Read : ఓవైపు సంబురం.. ఇంకోవైపు సమరం.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది.?