Minister Satyavathi Rathod : డబ్బును ఎలుకలు కొట్టేసిన రోగికి ప్రభుత్వం అండ
మహబూబాబాద్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి, అనారోగ్యానికి గురైన వృధ్దుడు భూక్య రెడ్యా దాచుకున్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎలుకలు కొట్టేసిన సంగతి తెలిసిందే.

Minister Satyavathi Rathod Assurance For Mahabubabad Patient
Minister Satyavathi Rathod : మహబూబాబాద్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి, అనారోగ్యానికి గురైన వృధ్దుడు భూక్య రెడ్యా దాచుకున్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎలుకలు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ డబ్బును మార్చుకోటానికి మహబూబాబాద్‌లోని బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
వాళ్లు కూడా హైదరాబాద్ వెళ్లి రిజర్వ్ బ్యాంక్ లో మార్చుకోవాల్సిందే అని… వాళ్ళుకూడా తీసుకుంటారో…. తీసుకోరో అని సందేహం వెలిబుచ్చేసరికి ఆవృధ్ధుడు దిగాలు పడిపోయాడు. తన కడుపులో పెరిగిన కణితి కి ఆపరేషన్ చేయించుకోవటం ఎలాగా అని దిగాలు పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఆ వృధ్దుడికి ఆపరేషన్ చేయిస్తానని, డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.