Graduate MLC election : ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్..కొనసాగుతున్న ఉత్కంఠ, 60 వేల ఓట్ల దూరంలో పల్లా

Graduate MLC election : ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్..కొనసాగుతున్న ఉత్కంఠ, 60 వేల ఓట్ల దూరంలో పల్లా

Mlc Counting

Updated On : March 20, 2021 / 2:03 PM IST

Palla Vs Teenmar Mallanna : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​లో ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. చివరి నుంచి అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. వారి సెకండ్ ప్రయారిటీ ఓట్లను మిగిలిన వారికి కలుపుతున్నారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. ఈ లెక్కన తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజేతలు ఎవరనే విషయం ఇవాళ రాత్రికి కానీ తేలే అవకాశం లేదు.

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 60వేల 529 ఓట్ల దూరంలో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి. నల్గొండ స్థానం నుంచి ఇప్పటికే 67 మంది ఎలిమినేట్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ 67వ అభ్యర్ధిగా ఎలిమినేట్ అయ్యారు. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

పల్లాకు 5వేల 252 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మల్లన్నకు 7 వేల 352 రెండో ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. కోదండరామ్‌కు 10 వేల 299 రెండో ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. పల్లా లక్షా 22 వేల 638 ఓట్లు సాధించారు. తీన్మార్ మల్లనకు మొత్తం 99 వేల 210 ఓట్లు లభించాయి. పల్లాకు 23 వేల 429 ఓట్లు లభించాయి. కోదండ రామ్‌కు మొత్తం 89 వేల 409 ఓట్లు లభించాయి. నల్గొండ స్థానంలో గెలవాలంటే లక్షా 83 వేల 167 ఓట్లు సాధించాల్సి ఉంది.