ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు.

ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy

MLC Jeevan Reddy : ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ సెక్టార్లోసైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బుద్ధి మారడం లేదు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా భావించి దశాబ్ద కాలం ప్రజలు రెండు సార్లు అవకాశం కల్పించారు. అయినా ఉద్యోగాల భర్తీలో ఆ పార్టీ విఫలమైందని జీవన్ రెడ్డి అన్నారు.

Also Read : జనసేన ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు

తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ సూచించినప్పటికీ ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించింది. టెట్ నిర్వహణను కూడా నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది. గ్రూప్ 1 పేపర్ లీకేజీ తో రాష్ట్రం పరువు పోయింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. గ్రూప్-2 పరీక్షలుసైతం నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేసినం. ప్రైవేట్ సెక్టార్లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసినం. డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.