MLC polls in Andhra, Telangana-2023 LiveUpdates: పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత.. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

MLC polls in Andhra, Telangana-2023 LiveUpdates: పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత.. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ

MLC polls in Andhra, Telangana-2023 LiveUpdates

MLC polls in Andhra, Telangana-2023 LiveUpdates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయటానికి అనుమతి ఇస్తున్నారు.

ఇక, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 29,720 ఓటర్లు ఉన్నారు.

అందులో పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులవి 2 ఓట్లు. 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ లో 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్ లో 11, నారాయణ పేట్ లో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ లో 18, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు కాగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 137 పీఓలు, 137 ఏపీఓలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈ నెల 16 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది. పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం 225లో ఓటు హక్కు  నియోగించుకోవడానికి వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు కలెక్టర్ బసంత్ కుమార్. ఆయన క్యూ లైన్లో రావడంతో ఇతర ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 13 Mar 2023 05:50 PM (IST)

    పార్వతీపురం జిల్లాలో టీడీపీ నేతల నిరసన

    పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్వతీపురంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఓటు వేసేందుకు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు అవకాశం ఇవ్వలేదంటూ పోలింగ్ అధికారులను టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మరికొందరు ఓటర్లు నిలదీశారు. దీంతో వారిని పోలింగ్ స్టేషన్ నుంచి పోలీసులు బయటకు పంపేశారు. దీంతో పలువురు టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

  • 13 Mar 2023 05:10 PM (IST)

    ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

    ఏపీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 8 స్థానాలకు ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తైంది. సాయంత్రం 4 గంటలకు ముందు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

  • 13 Mar 2023 05:09 PM (IST)

    నందికొట్కూరులో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

    నంద్యాల జిల్లా నందికొట్కూరులో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జి మండ్ర శివానందరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన సందర్భంగా టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. క్యూ లైన్‌లో నిలబడకుండా ఓటును ఎలా వేయనిస్తారని నిలదీసిన వైసీపీ నేతలు. శివానందరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ నేతలు గొడవకు దిగారు. అయితే, శివానంద రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా ఓటు వేసి ఎలక్షన్ బూత్ నుంచి వెళ్లిపోయారు. కానీ, పోలింగ్ బూత్ బయట మాత్రం ఇరు పార్టీ నేతలు గొడవకు దిగారు.

  • 13 Mar 2023 03:53 PM (IST)

    తాడిపత్రిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    అనంతపురం జిల్లా, తాడిపత్రిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రం 146 నుంచి ఓటర్ లిస్టును వైసీపీ ఏజెంతె తీసుకెళ్లాడు. దీనిపై టీడీపీ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో 15 నిమిషాలపాటు పోలింగ్ నిలిచిపోయింది. తర్వాత పోలీసులు ఓటర్ లిస్టు తెచ్చి ఇవ్వడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది.

  • 13 Mar 2023 03:50 PM (IST)

    టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం

    మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ పర్సంటేజ్ 2 గంటలకు 75.05 శాతం

    మహబూబ్ నగర్ జిల్లా- 64.32 %

    నాగర్ కర్నూల్ జిల్లా- 81.72 %

    వనపర్తి జిల్లా- 76 85 %

    గద్వాల్ జిల్లా- 88.48 %

    నారాయణపేట్ జిల్లా- 81.33 %

    రంగారెడ్డి జిల్లా- 65.50 %

    వికారాబాద్ జిల్లా- 79.94 %

    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా- 68.44%

    హైదరాబాద్ జిల్లా- 68.83 %

  • 13 Mar 2023 02:01 PM (IST)

    12 గంటల వరకు 43.8శాతం పోలింగ్

    హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. మరో మూడు గంటల్లో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో 12 గంటల వరకు 43.8శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. జిల్లాల వారీగా కూడా పోలింగ్ కేంద్రాలకు తక్కువ సoఖ్యలో టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక్కో కేంద్రంలో దాదాపుగా 200 నుంచి 300 ఓట్లు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలన్నీ... ఓటర్లు లేక వెలవెల బోతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు టీచర్లకు ఓటు వినియోగించుకోవడానికి కేంద్రాలకు రావాలని ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • 13 Mar 2023 01:57 PM (IST)

    ఓటు వేసి బ్యాలెట్ పేపర్ తో సెల్ఫీ

    ఓటు వేసి బ్యాలెట్ పేపర్ తో సెల్ఫీ తీసుకున్నారు శ్రీ వర్ధన్ కుమార్ అనే వైసీపీ కార్యకర్త. ఆ ఫొటోని వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. రామ కుప్పం పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. మొబైల్ ను పోలింగ్ బూత్ లోకి ఎలా అనుమతి ఇచ్చారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

  • 13 Mar 2023 01:55 PM (IST)

    శ్రీ సత్యసాయి జిల్లా: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ధర్మవరం పట్టణం కళా జ్యోతిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్ 176లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి, ఆయన సతీమణి సుప్రియ, సోదరుడు వెంకటకృష్ణ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 Mar 2023 01:54 PM (IST)

    చంద్రబాబు ఫోన్ చేశారు: ప్రకాశం జిల్లా ఎస్పీ

    ప్రకాశం జిల్లా: చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని జిల్లా ఎస్పీ మలికా గర్గ్ అన్నారు. ఒంగోలులో జరిగిన ఘర్షణ ఘటన పై విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ చేశారని అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు. విచారణ అనంతరం అదుపులో ఉన్న ఇద్దరిని వదిలేస్తామని తెలిపారు.

  • 13 Mar 2023 01:48 PM (IST)

    పోలింగ్ శాతం వివరాలు

    ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి పోలింగ్ శాతం..

    తిరుపతి జిల్లాలో మధ్యాహ్నం 12.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు:

    పట్టభద్రులు: 24.73%
    ఉపాధ్యాయులు: 38.89%

    మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ పర్సంటేజ్ ఉదయం 12 గంటలకు 48.53 శాతం

    మహబూబ్ నగర్ జిల్లా 42.33%

    నాగర్ కర్నూల్ జిల్లా 53.07%

    వనపర్తి జిల్లా 52.58%

    గద్వాల్ జిల్లా 61.00%

    నారాయణపేట్ జిల్లా 54.37%

    రంగారెడ్డి జిల్లా 43.80%

    వికారాబాద్ జిల్లా 46.50%

    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 35.21%

    హైదరాబాద్ జిల్లా 47.94%

  • 13 Mar 2023 01:15 PM (IST)

    ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: ఆనం

    నెల్లూరు: సంతపేట మోడల్ స్కూల్లో తన కుమార్తెతో కలసి పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ.. "పట్టభద్రుల నియోజకవర్గ ఓటును వినియోగించుకున్నాను. జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై మీడియాలో వస్తున్న కథనాలు చుస్తే మనసు కష్టంగా ఉంది. పరిస్థితులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. వ్యవస్థలు నిర్వీర్యమయిపోతున్నాయి. భవిష్యత్ తరాలకు మనమేమిస్తున్నామన్న విషయాన్ని తలచుకుంటేనే ఆవేదన కలుగుతోంది. ప్రజలకు అవససమైనప్పుడు గుర్తుకు వచ్చేవి రెండే.. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండు ఎన్నికల వ్యవస్థ. అవే ఇప్పుడు నవ్వుల పాలవుతున్నాయి. అన్ని వ్యవస్థలు దిగజారుతున్నాయి. పోలీస్, ఎన్నికల అధికారులకు దిక్కులేకుండా పోయింది. ఎన్నికలను నవ్వుల పాలు కాకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.

  • 13 Mar 2023 12:03 PM (IST)

    ఏలూరు: 184 ఓట్లకు 177 ఓట్లు పోల్

    ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్

    మొత్తం 184 ఓట్లకు ఇప్పటి వరకు 177 ఓట్లు పోల్

  • 13 Mar 2023 12:02 PM (IST)

    బీజేపీ నాయకుల అరెస్ట్

    అనంతపురం:
    కేఎస్ఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతల ఆందోళన
    రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన నాయకులు
    బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
    వైసీపీ నాయకులకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న బీజేపీ నేతలు
    దొంగ ఓట్లు వేసేందుకు అనుమతి ఇస్తున్నారంటూ బీజేపీ నాయకుల ఆగ్రహం
    అసలైన ఓట్లు గల్లంతు అయ్యాయని, దీనిపై అధికారులు సమాధానం చెప్పట్లేదని ఆరోపణ
    వైసీపీ నాయకులు పోలింగ్ బూత్ లోకి యథేచ్ఛగా వెళ్తున్నారని వ్యాఖ్య
    బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ను కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన

  • 13 Mar 2023 11:56 AM (IST)

    ప్రొద్దుటూరులో స్వల్ప ఉద్రిక్తత

    వైఎస్సార్ కడపజిల్లా
    ప్రొద్దుటూరులో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత
    టీడీనీ, వైసీపీ నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం
    పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అడిషనల్ ఎస్పీలు తుషార్ డూడీ, ప్రేరణ కుమార్

  • 13 Mar 2023 11:52 AM (IST)

    19.54% పోలింగ్

    హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 10 గంటల వరకు 19.54% పోలింగ్ నమోదైంది. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక అల ఈ మేరకు వివరాలు తెలిపారు.

  • 13 Mar 2023 11:34 AM (IST)

    ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్లు: ఎమ్మెల్యే నిమ్మల

    పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ నేత నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో జగన్ పని అయిపోయిందని, దానికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికలేనని అన్నారు. ఓటమి భయంతోనే దొంగ ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. నాలుగేళ్లలో సంక్షేమం ,అభివృద్ధి చేసి ఉంటే ఓట్లను ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చిందని అన్నారు. పశ్చిమ గోదావరిలో వైసీపీకి మెజార్టీ ఓటర్లు ఉన్నా ఓటమి భయంతో పెద్ద ఎత్తున డబ్బు తాయిలాలు పంపిణీ చేశారని తెలిపారు. జగన్ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. ఆర్థిక సంఘం నిధుల్ని మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందని విమర్శించారు.

  • 13 Mar 2023 11:24 AM (IST)

    దొంగదెబ్బ తీయాలనే కుట్ర: మంత్రి సీదిరి అప్పలరాజు

    శ్రీకాకుళం: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును పలాసలో వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం దొంగదెబ్బ తీయాలనే కులాల పేరుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ ను బరిలో ఉంచారని తెలిపారు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పారు. కులాలు ఎగదోసి, పార్టీల వెనకుండి, అసమానతలు రెచ్చకొట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ఈ ఎన్నికలతో అయినా బుద్ధి తెచ్చుకొవాలని చెప్పారు. విశాఖను రాజధాని‌ చేయాలని గొప్ప పాలసీని సీఎం జగన్ తీసుకువచ్చారని తెలిపారు.

    గ్రాడ్యుయేట్స్ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా ఉండాలని అన్నారు. టీడీపీ వారు వారి కులం వారే బాగుపడాలని లక్ష్యంతో అమరావతి రాజధాని కావాలంటూ కోర్ట్ లకు వెళ్లారని చెప్పారు. చంద్రబాబు వైఖరిని గ్రాడ్యుయేట్స్ గ్రహించాలని అన్నారు. గెలవటానికి టీడీపీ పోటీచేయటం లేదని, ఎలాగైనా జగన్ మనిషిని ఓడించాలని కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశారని అన్నారు. రెండవ ప్రాధాన్య ఓటు విషయంలో ఇతర పార్టీలతో టీడీపీ కమ్మక్కు అయిందని చెప్పారు. చంద్రబాబు ఎన్నికలు వస్తే నక్కజిత్తులు చేస్తారని అన్నారు. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు అల్ ది బెస్ట్ చెబుతున్నాని అన్నారు.

  • 13 Mar 2023 11:15 AM (IST)

    నకిలీ ఓటరును గుర్తించాం: 'సీపీఎం' వి.శ్రీనివాసరావు

    విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి జీవకోన ఏరియాలో బూత్‌ నెంబర్‌ 233, 234ల్లో ఓటు వేయడానికి వెళ్తున్న నకిలీ ఓటరును గుర్తించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద తాము ప్రశ్నించినప్పుడు 10వ తరగతి చదువుకున్నానని ఓ ఓటరు చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా నమోదైందని తెలిపారు. ఈ ఘటనతో అధికార పార్టీ నకిలీ ఓటర్లను చేర్పించినట్లు స్పష్టంగా రుజువైందని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. ఇప్పటికైనా నకిలీ ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ని కోరుతున్నామని తెలిపారు.

  • 13 Mar 2023 10:51 AM (IST)

    ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జీ

    ప్రకాశం జిల్లా:
    ఒంగోలు శ్రీనివాస్ థియేటర్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ముందే టీడీపీ-వైసీపీ వర్గాల మద్య ఘర్షణ
    తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల చార్జీ
    ఇరువర్గాలను చితగ్గొట్టిన పోలీసులు
    టీడీపీలోని ఓ నేతను చితక బాదిన వైసీపీ నాయకులు
    టీడీపీ నాయకులను పక్కనే ఉన్న ఓ షెల్టర్లోకి తోసివేసి నిర్బంధించిన పోలీసులు

  • 13 Mar 2023 10:48 AM (IST)

    టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ

    అమరావతి:

    టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ
    ఎమ్మెల్సీ ఎన్నికల సరళిపై చర్చ
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ భారీగా ప్రలోభాలకు తెరతీసిందని తెలుగుదేశం మండిపాటు
    డబ్బుల పంపిణీలో స్వయంగా మంత్రులే చేపడుతుండడాన్ని సీరియస్ గా పరిగణిస్తోన్న చంద్రబాబు
    భారీగా బోగస్ ఓట్ల చేరికపై తీవ్ర ఆగ్రహం
    నేతలతో చర్చించాక తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు

  • 13 Mar 2023 10:46 AM (IST)

    వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య ఘర్షణ

    నంద్యాల:
    ఆత్మకూరు బాలికల ఉన్నత పాఠశాలలలోని పట్టభద్రుల పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్త వాతావరణం
    వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య ఘర్షణ
    వైసీపీ నాయకులను పోలింగ్ బూత్ దగ్గరికి అనుమతించడంపై ఆగ్రహం
    వైసీపీ నాయకులు-టీడీపీ నాయకులు ఘర్షణకు దిగి ఒకరినొకరు తోసుకున్న వైనం
    టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులకు నచ్చ చెప్పడంతో సద్దుమణిగిన గొడవ
    అక్కడి నుంచి అందరినీ పంపించేసిన పోలీసులు

  • 13 Mar 2023 10:43 AM (IST)

    ఓటు వేసిన మంత్రి కార్మూరి నాగేశ్వరరావు

    ఏలూరు:
    నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఓటు వేసిన మంత్రి కార్మూరి నాగేశ్వరరావు
    ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ బలపర్చిన కౌరు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
    రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఒక లక్ష్యం లేదని విమర్శ
    దోచుకోవాలి ..దాచుకోవాలనే చూస్తున్నాయన్న మంత్రి
    తెలంగాణలో బీసీల గురించి మాట్లాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రాలో బీసీలకు అన్యాయం జరుగుతుందనడం విడ్డూరంగా ఉందన్న కారుమూరి నాగేశ్వరరావు
    పవన్ కల్యాణ్ మాట్లాడేదంతా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ అన్న మంత్రి

  • 13 Mar 2023 10:38 AM (IST)

    సీఐ రాములు నాయక్-టీడీపీ నేతల మధ్య వాగ్వాదం

    నెల్లూరు:

    నగరంలోని రామమూర్తి నగర్ పోలింగ్ కేంద్రం వద్ద బాలాజీ నగర్ సీఐ రాములు నాయక్-టీడీపీ నేతలు రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ ల మధ్య వాగ్వాదం

    పోలింగ్ కేంద్రం వద్ద ఎవరూ ఉండకూడదు అంటూ టీడీపీ నేతలకు చెప్పిన రాములు నాయక్
    సాంకేతిక సమస్యలు ఉన్నందున సందేహాలు నివృత్తి చేసుకుంటున్నామన్న టీడీపీ నేతలు
    రాములు నాయక్ ను హెచ్చరించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్

  • 13 Mar 2023 10:29 AM (IST)

    ఏజెంట్లకు,అధికారుల మధ్య వాగ్వాదం

    కర్నూలు:

    ఎమ్మిగనూరులో ఏజెంట్లకు,అధికారుల మధ్య వాగ్వాదం
    261 పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లకు అనుమతి ఇవ్వని అధికారులు
    అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజెంట్లు
    మాచని స్కూల్లో 261 పోలింగ్ కేంద్రంలో అధికారులతో టీడీపీ రిలీవింగ్ ఏజెంట్లు
    ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్ల వాగ్వాదం
    టీడీపీకి చెందిన రిలీవింగ్ ఏజెంట్ లకు పాస్ లు ఇవ్వని అధికారులు
    ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎజెంట్లను అనుమతించని అధికారులు.

  • 13 Mar 2023 10:24 AM (IST)

    పశ్చిమగోదావరి జిల్లాలో ఓవరాల్ పర్సంటేజ్ 6.15%

    ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా:
    ఉదయం 9 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పర్సంటేజ్..
    జంగారెడ్డి గూడెం..
    పోలైన ఓట్లు- 7
    పర్సంటేజ్ - 3.8%

    కొవ్వూరు
    పోలైన ఓట్లు-36
    పర్సంటేజ్ -14.88%

    నర్సాపురం..
    పోలైన ఓట్లు-5
    పర్సంటేజ్ -2.18%

    ఏలూరు
    పోలైన ఓట్లు-18
    పర్సంటేజ్ -7.23%

    భీమవరం
    పోలైన ఓట్లు-2
    పర్సంటేజ్ -1%

    ఓవరాల్ పర్సంటేజ్ 6.15%.

  • 13 Mar 2023 10:10 AM (IST)

    ఆరోపణలపై మంత్రి ఉషశ్రీ చరణ్ ఆగ్రహం

    అనంతపురం:
    కల్యాణ దుర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్
    వైరల్ అయిన వీడియోపై స్ఫందించిన మంత్రి ఉషాశ్రీ
    ఓటర్లను ప్రలోభ పెట్టారన్న అంశంపై మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆగ్రహం
    వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవం లేదు.. దానిని మార్ఫింగ్ చేశారని వ్యాఖ్య
    నేను నా టేబుల్ మీద వేరే అంశం గురించి డిస్కస్ చేస్తున్నానన్న మంత్రి
    ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారన్న ఉషశ్రీ
    ఒక బీసీ మహిళ మంత్రి అయిందని జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్య
    భూములు కొన్నా వివాదం చేస్తున్నారని ఆగ్రహం.

  • 13 Mar 2023 10:01 AM (IST)

    పలువురు టీడీపీ నేతల ముందస్తు అరెస్టు

    తిరుపతి: బూత్ వద్దకు వచ్చిన పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. టీటీడీ పరిపాలన భవనం పోలింగ్ కేంద్రం వద్ద టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.

    మరోవైపు, నగరంలోని పలు బూత్ లను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సందర్శిస్తున్నారు. ఎవరైనా దొంగ ఓట్లు వేస్తున్నారా? అంటూ నగరంలోని పోలింగ్ కేంద్రాలలో వామపక్ష నేతలు ఆరా తీస్తున్నారు. ఎవరిపై అయినా అనుమానం వస్తే మీకు డిగ్రీ ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, కొందరు పొగరుగా సమాధానం ఇస్తున్నారు. పదవ తరగతి వరకే చదివామంటూ సమాధానం ఇచ్చి ఓటు వేయడానికి కొందరు ఓటర్లు ముందుకు వెళ్లడం గమనార్హం.

  • 13 Mar 2023 09:51 AM (IST)

    నా ఓటు తొలగించారు: ఓ టీచర్ ఆవేదన

    శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం ఎంజీఎం పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటును తొలగించారంటూ ఉపాధ్యాయుడు అంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.

    శ్రీకాకుళం: పట్టణంలోని టీపీఏం స్కూల్ లో గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ దంపతులు.

    కడప జిల్లా: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల సత్రం హై స్కూల్ లోని 75వ పొలింగ్ బూత్ లో ఓటు వేశారు.

  • 13 Mar 2023 09:23 AM (IST)

    యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓటు గల్లంతు

    విజయనగరం జిల్లా:

    యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర పట్నాయక్ ఓటు గల్లంతు
    కస్పా హై స్కూల్ పోలింగ్ స్టేషన్ బూత్ నెంబర్ 128 ఓటర్ జాబితాలో పేరు ఉన్నట్లు ఓటర్ స్లిప్ జారీచేసిన అధికారులు
    తీరా పోలింగ్ స్టేషన్ కి వెళ్లగా... అక్కడి జాబితాలో ఓటు లేదు
    అధికారుల తీరుపై మండిపడ్డ రమేష్ చంద్ర.

  • 13 Mar 2023 09:19 AM (IST)

    పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: పర్వతరెడ్డి చంద్రశేఖర్

    పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ అన్నారు. ఓటేసేందుకు వస్తున్న టీచర్లు ఎక్కువ శాతం మంది తనకు మద్దతు పలుకుతున్నారంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను టీచర్ల సమస్యలకు పరిష్కారం చూపుతానని ప్రతి ఒక్కరూ బావిస్తున్నారని తెలిపారు.

     

  • 13 Mar 2023 09:10 AM (IST)

    నెల్లూరులో..

    పోలింగ్ కేంద్రాల వద్ద మొదలైన సందడి
    ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పట్టభద్రులు, టీచర్ ఓటర్లు
    జిల్లా వ్యాప్తంగా 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
    ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

    డీకేడబ్ల్యూ పోలింగ్ కేంద్రానికి సందర్శించిన వైసీపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పీడీఎఫ్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబు రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

  • 13 Mar 2023 08:56 AM (IST)

    మహబూబ్ నగర్ జిల్లాలో

    మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 నుంచే క్యూలైన్లలో ఓటర్లు నిలబడ్డారు.

  • 13 Mar 2023 08:51 AM (IST)

    క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్

    పుట్టపర్తిలో ఎమ్మెల్సీ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికల పోలింగ్

    పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం 225లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డ కలెక్టర్ బసంత్ కుమార్

    సామాన్యుడి మాదిరి వచ్చి అందరితో పాటు క్యూలైన్ లో వచ్చి ఓటు హక్కు ను వినియోగించుకున్న కలెక్టర్

    క్యూ లైన్లో రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఓటర్లు.

  • 13 Mar 2023 08:47 AM (IST)

    కర్నూలు జిల్లాలో..

    మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
    జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్
    టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అనంతపురంలో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ కర్నూలులో నిర్వహించనున్న అధికారులు
    కర్నూలు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 74,నంద్యాల జిల్లాలో 61 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
    ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో 27, నంద్యాల జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కర్నూలు,నంద్యాల జిల్లాలలో 6 పోలింగ్ కేంద్రాలు

    పట్టభద్రుల ఓటర్లు: 61,633

    ఉపాధ్యాయ ఓటర్లు: 5,391

    స్థానిక సంస్థల ఓటర్లు: 1,178

    గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి బరిలో 49 మంది అభ్యర్థులు, టీచర్స్ ఎమ్మెల్సీకి 12 మంది అభ్యర్థులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ముగ్గురు అభ్యర్థులు

    గ్రాడ్యుయేట్ ఓటర్లకు 93%, టీచర్స్ ఓటర్లకు 89%, స్థానిక సంస్థల ఓటర్లకు 100 శాతం ఓటర్ స్లిప్స్ పంపిణీ

    ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు

    56 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు

    ఓటర్ గుర్తింపుకు 10 రకాల కార్డులను అనుమతి

    కర్ణాటక,తెలంగాణ సరిహద్దుల్లో 12 చెక్పోస్టులు ఏర్పాటు

    ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్కార్డులు ఏర్పాటు చేసిన అధికారులు

    ఎన్నికల బందోబస్తు కోసం 1124 మందిని పోలీసులు ఏర్పాటు

  • 13 Mar 2023 08:42 AM (IST)

    ఏయే జిల్లాల్లో ఎలా?

    ప్రకాశం
    ప్రకాశం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఉపాద్యాయ, పట్టబద్రుల ఎమ్మెల్సి ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

    ప్రకాశం జిల్లా పట్టభద్రుల ఎన్నికల వివరాలు
    ప్రకాశం జిల్లా:
    పోలింగ్ స్టేషన్ లు : 98
    ఓటర్లు: పురుషులు 55,703, స్త్రీలు 26,517, ఇతరులు 5, మొత్తం ఓటర్లు 82,225

    బాపట్ల జిల్లా:
    పోలింగ్ స్టేషన్ లు : 27
    ఓటర్లు: పురుషులు 17,626, స్త్రీలు 8,763, ఇతరులు 1, మొత్తం ఓటర్లు 26,390

    ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు..
    పోలింగ్ స్టేషన్ లు: 40
    ఓటర్లు: పురుషులు 3691, స్త్రీలు 2098, ఇతరులు 0, మొత్తం ఓటర్లు 5789

    కడప జిల్లా..
    నేడు ఉమ్మడి కడప జిల్లాలో గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఎన్నికలు

    జిల్లా వ్యాప్తంగా 131పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
    ఈ సారి జంబో బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలు
    కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేసిన పోలీసులు

  • 13 Mar 2023 08:03 AM (IST)

    పోలింగ్ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.