Rain Alert : తెలంగాణకు భారీవర్షసూచన

తెలంగాణలో ఈరోజు,రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తాయని... ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వానలు  కురుస్తాయని హైదరాబాద్‌లోని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Rain Alert : తెలంగాణకు భారీవర్షసూచన

Moderate Rains In Telangana

Updated On : September 18, 2021 / 7:44 PM IST

Rain Alert : తెలంగాణలో ఈరోజు,రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తాయని… ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వానలు  కురుస్తాయని హైదరాబాద్‌లోని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి శనివారం తెలంగాణా నుండి రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ నుండి 1.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది.

నిన్నటి తూర్పు మధ్య బంగళాఖాతం & పరిసర ఈశాన్య బంగాళా ఖతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య & పరిసర పశ్చిమ బంగాళా ఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుండి 5.8కి.మీ వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నది. ఈ ఆవర్తనం రాగల 12 గంటలలో ఒడిస్సా తీరం దగ్గరకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

సోమవారం సెప్టెంబర్ 20న తెలంగాణలో ఒకటి రెండు ప్రదేశములలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి….. ఉరుములు , మెరుపులతో కూడిన వర్షములు కొన్ని జిల్లాలలో ఒకటి,రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. 20,21వ తేదీలలో తెలంగాణా రాష్ట్రములో ఒకటి రెండు ప్రదేశములలో భారీ వర్షములు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కోన్నారు.

.